కొందరికి రాత్రి నిద్ర అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడితేనే కానీ నిద్ర రాదు. నిద్ర రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందుకే పడుకునేముందు కొన్ని డ్రింక్స్ తాగాలట. చమేలీ టీ తాగితే మెరుగైన నిద్ర వస్తుందని చెప్తున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రనిస్తుంది. బాదం మిల్క్‌లో ట్రైప్టోఫాన్స్ ఉంటాయి. ఇవి మెరుగైన నిద్రను ఇస్తాయి. పాలల్లోని పొటాషియం, మెగ్నీషియం కండరాల నొప్పులను తగ్గించి నిద్రను ఇస్తుంది. పాల్లలో పసుపు కలిపి తీసుకుంటే కూడా మెరుగైన హెల్త్ మీ సొంతమవుతుంది. ఆల్కహాల్ కూడా మీ రెగ్యూలర్ నిద్రను దెబ్బతీస్తుంది. కాబట్టి దానిని తాగకుంటే మంచిది. కెఫిన్ వంటి వాటిని తీసుకుంటే నిద్ర మీకు దూరమవుతుంది. ఇది కేవలం అవగాహనకోసం మాత్రమే. డాక్టర్ సలహా కచ్చితంగా తీసుకుని తినాలి. (Images Source : Unsplash)