అన్వేషించండి

Avisaginjala Karam Podi : అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే అవిసెగింజల కారంపొడి.. ఇలా చేస్తే రెండునెలలు నిల్వ ఉంటుంది

Flax Seeds Podi : అవిసెగింజలు అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే దీనిని రెగ్యూలర్​గా తీసుకోవాలంటే అవిసెగింజల కారంపొడి బెస్ట్ ఆప్షన్. దీనిని ఎలా తయారు చేయాలంటే..

Flaxseeds Powder aka Avisaginjala Karam Podi : అవిసెగింజలు జుట్టు పెరుగుదలకు, స్కిన్ కేర్​కు బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, న్యూట్రిషియన్లు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అలా వీటిని నేరుగా తినాలన్నా కూడా టైమ్ లేదు అది ఇది అనుకుంటాము. కానీ దీనిని రెగ్యూలర్​గా తీసుకోవాలనుకుంటే అవిసె గింజలతో టేస్టీ కారం పొడి చేసుకోవచ్చు. ఇది మీకు మంచి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో? రెగ్యూలర్​గా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

ఫ్లాక్స్ సీడ్స్ - అరకప్పు

ఎండు మిర్చి - 20

పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్

మినపప్పు - 1 టేబుల్ స్పూన్

జీలకర్ర - 1 స్పూన్

ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు

వెల్లుల్లి - 8 రెబ్బలు

నూనె  - 2 స్పూన్లు

చింతపండు - నిమ్మకాయ సైజ్​లో ఉండాలి

ఉప్పు - రుచికి తగినట్లు

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. దానిలో టీస్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో అవిసె గింజలు వేయండి.  వీటిని లో ఫ్లేమ్​లో ఉంచి వేగనివ్వండి. ఇలా చిన్నమంట మీద వేయించడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ.. ఇలా చేయడం వల్ల అవిసెగింజల లోపలి కూడా మంచిగా ఉడికి ఫ్రై అవుతుంది. మంట ఎక్కువ అయితే పైపైన వేగి.. లోపల వేగేలోపు మాడిపోతాయి. లో ఫ్లేమ్​ మీద వేపినప్పుడు.. అవి వేగే సమయానికి మంచి అరోమా వస్తుంది. అప్పుడు మీరు వాటిని మంటమీద నుంచి తీసేయొచ్చు. 

వేగిన అవిసెగింజలను పక్కన పెట్టి అదే కడాయిని మళ్లీ స్టౌవ్​పై పెట్టండి. దానిలో మరో టీస్పూన్ నూనె వేసి వేడిచేయండి. దానిలో పచ్చిశనగపప్పు వేయండి. అవి సగం ఉడికిన తర్వాత మినపప్పు వేసి ఫ్రై చేయండి. పొట్టు మినపప్పు వేసుకుంటే మంచి అరోమా, రుచి వస్తుంది. పప్పు వేగి మంచి అరోమా వస్తున్నప్పుడు జీలకర్ర, ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుని వాటిని స్టౌవ్ ఆపేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. 

రెండు నెలలు నిల్వ ఉంటుంది..

అదే కడాయిలో ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి.. ఎండుమిర్చి రంగు మారేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి వెల్లుల్లిని పక్కకు తీసిపెట్టుకోండి. పప్పులు, ఎండుమిర్చి, అవిసెగింజలు చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దానిలో చింతపండు.. అవిసెగింజలు, ఎండుమిర్చి, పప్పులు, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. చివరిలో వెల్లుల్లి వేసి వాటిని ఓ సారి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇడ్లీలు, దోశలలోకి కావాలనుకుంటే మీరు దానిని కాస్త బరకగా చేసుకోవచ్చు. అన్నంలోకి, ఫ్రైలలోకి కావాలనుకుంటే మెత్తని పౌడర్​గా చేసుకోవచ్చు. అంతే అవిసెగింజల కారంపొడి రెడీ. ఇది మీకు మంచి టేస్ట్​ని ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. గాలి చొరబడని కంటైనర్​లో పెట్టుకుంటే ఇది 2 నెలలు నిల్వ ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలకై..

మధుమేహమున్నవారు కూడా దీని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. ఇడ్లీ, దోశలు, ఉప్మాలలో దీనిని కలిపి తినవచ్చు. అన్నంలో మొదటి ముద్దను దీనితో హాయిగా లాగించేయవచ్చు. అంతేకాకుండా ఇంట్లో చేసుకునే ఫ్రైలలో మసాలగా దీనిని వేసుకోవడం వల్ల డిష్​కి మంచి రుచి, అరోమా వస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. శరీరంలో కొల్లాజిన్​ను ఉత్పత్తి చేసి చర్మానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ పొడితో రోజుకు ఒక్క ముద్ద తిన్నా చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దీని ద్వారా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి.

Also Read : ఎలాంటి ఎఫర్ట్​ లేకుండా కొంబుచా టీతో బరువు తగ్గిపోతారట.. ఈ ఫంగస్​ టీపై న్యూ స్టడీ ఏమంటుందంటే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget