అన్వేషించండి

Kombucha Tea : ఎలాంటి ఎఫర్ట్​ లేకుండా కొంబుచా టీతో బరువు తగ్గిపోతారట.. ఈ ఫంగస్​ టీపై న్యూ స్టడీ ఏమంటుందంటే

Kombucha Tea Benefits : కొంబుచా టీ అనే ఓ డ్రింక్​ తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇంతకీ ఈ కొంబుచా టీ ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి??

Weight Loss Drink Kombucha Tea : సాధారణంగా టీలతో బరువు తగ్గడం అనేది మనం తక్కువగా వింటాము. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం మాత్రం టీ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి బరువు కంట్రోల్​లో ఉంటుందని తెలిపింది. అదే కొంబుచా టీ. ఇది జీవక్రియ వ్యాధులనుంచి రక్షణ కల్పించి.. ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో హెల్ప్ చేస్తుంది. కొంబుచా టీలోని ప్రోబయోటిక్ సూక్ష్మజీవులు మోడల్ ఆర్గానిజం కేనోరబ్డిటిస్ ఎలిగాన్స్​ని ఉపయోగించి జీవక్రియను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. 

కొంబుచా టీపై అధ్యయనం గురించి PLoS జెనెటిక్స్​లో ప్రచురించారు. సంప్రదాయ వైద్యంలో కొంబుచా టీతో దీర్ఘకాల ప్రయోజనాలు పొందినప్పటికీ.. దీని గురించి అంతర్లీనంగా అధ్యయనం చేసేందుకు పరిశోధకులు ముందుకెళ్లారు. దీనిలో కొంబుచా టీ అనుబంధ సూక్ష్మజీవులు హోస్ట్ ఫిజియాలజీని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. ముఖ్యంగా లిపిడ్ జీవక్రియకు సంబంధించి ఎలిగాన్స్​ను మోడల్ సిస్టమ్​గా ఉపయోగిస్తుందని కనుగొన్నారు. 

కొంబుచా టీని ఎలా తయారుచేస్తారంటే..

కొంబు చా టీ అనేది పులియబెట్టిన టీ. ఇది తియ్యని రుచిని ఇస్తుంది కానీ.. ఇది అందరికీ రుచించకపోవచ్చు. టీ ఫంగస్, టీ పుట్టగొడుగులతో దీనిని తయారు చేస్తారు. ఇది తియ్యటి బ్లాక్​ టీని పోలి ఉంటుంది. ఇది వివిధ ఫ్లేవర్​లలో అందుబాటులో ఉంటుంది. ఈ పులియబెట్టిన టీ బ్యాక్టీరియా పేగులను ప్రభావితం చేసి.. జీవక్రియను మార్చుతుందని పరిశోధకులు కనుగొన్నారు. తద్వారా శరీరంలో పేరుకపోయిన కొవ్వు నిల్వలు తగ్గుతున్నాయని తెలిపారు. ఈ టీ లిపిడ్ నిల్వలలో గణనీయమైన తగ్గింపునకు దారితీసింది. దానివల్ల మెటబాలీజంపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. గతంలో కొంబుచా టీలోని SCOBY (సింబయాటిక్​ కల్చర్స్ ఆఫ్ బాక్టీరియా ఈస్ట్​)లోని సారాలు రక్తపోటును తగ్గిస్తాయని కూడా తేలింది. 

కొవ్వు నిల్వలను కరిగేలా చేస్తాయి..

ట్రైగ్లిజరైడ్​లు మానవ శరీరంలో కొవ్వును నిల్వలు, శక్తి నిల్వలు, విడుదలలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అధిక కేలరీలు తీసుకోవడం వల్ల లిపిడ్​లో అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి కొవ్వు పెరిగేలా చేసి.. గుండె జబ్బులు వంటి ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. కంబుచా టీలోని ప్రోబయోటిక్ లక్షణాలు ట్రైగ్లిజరైడ్​లపై సానుకూల ప్రభావం చూపిస్తాయి. ఇవి కొవ్వును కరిగేలా చేసి గుండె జబ్బులను దూరం చేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇతర అధ్యయనాల్లో ఈ టీలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొప్ప సామర్థ్యాన్ని చూపిస్తాయని నిరూపించాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయని తేల్చాయి. ప్రస్తుత పరిశోధన కూడా ఈ టీపై సానుకూల ఫలితాలు ఇచ్చింది. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమంటున్నారు శాస్త్రవేత్తలు. 

మరిన్ని సానుకూల ఫలితాలు

కొంబుచా టీలోని ప్రోబయోటిక్ లక్షణాలు జీవక్రియను ప్రేరేపించి.. పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి. ఈ పరిశోధన వల్ల కొంబుచా టీ శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని తేలింది. అంతేకాకుండా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఇది హెల్ప్ చేస్తుందని జర్నల్​లో రాసుకొచ్చారు. స్థూలకాయం, మధుమేహం వంటి జీవక్రియ రుగ్మతలున్నవారు దీనిని తీసుకోవచ్చని.. దీనివల్ల మంచి ఫలితాలు పొందవచ్చని చెప్తున్నారు. అయితే ఇది మానవ జీవక్రియ రుగ్మతలలో చికిత్సా సామర్థ్యాన్ని మరింత పెంచుతాయా లేదా అనేదానిపై పరిశోధకులు మరో అధ్యయనం చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఫలితాలను ధృవీకరించడానికి, క్లినికల్ అప్లికేషన్​లను అనువదించడంపై మరిన్ని అధ్యయనాలు జరగనున్నాయి. 

Also Read : హీట్​ స్ట్రోక్​ లక్షణాలు ఇవే.. వడదెబ్బ కొడితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ప్రాణాలకే ప్రమాదం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget