అన్వేషించండి

RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాలు ఇలా

RRB ALP Recruitment: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB ALP Application 2025: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా.. మే 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

వివరాలు..

* అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు

ఖాళీల సంఖ్య: 9,970. 

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీలు

➥ అహ్మదాబాద్: 497 పోస్టులు

➥ అజ్మీర్: 820 పోస్టులు

➥ ప్రయాగ్‌రాజ్‌: 588 పోస్టులు

➥ భోపాల్‌: 664 పోస్టులు

➥ భువనేశ్వర్: 928 పోస్టులు

➥ బిలాస్‌పూర్: 568 పోస్టులు

➥ చండీఘడ్‌: 433 పోస్టులు

➥ చెన్నై: 362 పోస్టులు

➥ గువాహటి: 30 పోస్టులు

➥ జమ్ము అండ్‌ శ్రీనగర్: 08 పోస్టులు

➥ కోల్‌కతా: 720 పోస్టులు

➥ మాల్దా: 432 పోస్టులు

➥ ముంబయి: 740 పోస్టులు

➥ ముజఫర్‌పూర్: 89 పోస్టులు

➥ పట్నా: 33 పోస్టులు

➥ ప్రయాగ్‌రాజ్: 286 పోస్టులు

➥ రాంచీ: 1,213 పోస్టులు

➥ సికింద్రాబాద్: 1,500 పోస్టులు

➥ సిలిగురి: 95 పోస్టులు

➥ తిరువనంతపురం: 148 పోస్టులు

➥ గోరఖ్‌పూర్: 100 పోస్టులు

అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ దరఖాస్తుకు అర్హులు. 

వయోపరిమితి: 01.07.2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-6-8 సంవత్సరాలు; రైల్వేలో గ్రూప్-సి, గ్రూప్-డి విభాగంలో పనిచేస్తున్నవారికి 40-43-45 సంవత్సరాలు; వితంతువులు, ఒంటరి మహిళలకు 35-38-40 సంవత్సరాలు; 25 సంవత్సరాలలోపు ఉండి అప్రెంటిస్ పూర్తిచేసినవారికి 35-38-40 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 

స్టేజ్-1 పరీక్ష విధానం..
మొత్తం 75 మార్కులకు స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ⅓ మార్కులు కోత విదిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

స్టేజ్-2 పరీక్ష విధానం..
మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పేపర-2 పరీక్ష సమయం 60 నిమిషాలు.  

పే స్కేల్: నెలకు రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  11.05.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 13.05.2025.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 14.05.2025 నుంచి 23.05.2025.

Notification

Website

టాప్ హెడ్ లైన్స్

West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget