అన్వేషించండి

RRB Exam: అసిస్టెంట్ లోకో పైలట్‌ స్టేజ్-2 పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదే

RRB ALP Exam: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(స్టేజ్-2) తేదీల్లో మార్పులు.. ఈ పరీక్ష మే 2 , 6 తేదీలలో జరుగుతుంది.

RRB ALP CBT 2 Exam Dates 2025: రైల్వేశాఖ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(స్టేజ్-2) సవరించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. మార్చి 19, 20 తేదీల్లో స్టేజ్-2 పరీక్షలు జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా అసిస్టెంట్‌ లోకో పైలట్‌(స్టేజ్-2) పరీక్ష వాయిదా పడింది. సవరించిన తేదీలు మే 2, 6. స్టేజ్-2 పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను పొందవచ్చు. పరీక్షకు సంబంధించిన సెంటర్‌ వివరాలు పరీక్షకు 10 రోజులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.  రైల్వేశాఖ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (స్టేజ్-1) ఫలితాలను, కట్‌ఆఫ్‌ మార్కులను ఫిబ్రవరి 26న విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్టేజ్‌- 1 పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేయగా మొత్తం 1,251 మంది స్టేజ్-2 పరీక్షకు ఎంపికయ్యారు. 

Download RRB ALP CBT 2 Admit Card

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచింది. దీంతో 5,696గా ఉన్న ఏఎల్‌పీ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధామ్యాల (Preferences) నమోదుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33కి పెంచిన సంగతి తెలిసిందే. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

స్టేజ్-2 పరీక్ష విధానం..
మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పేపర-2 పరీక్ష సమయం 60 నిమిషాలు.  

పోస్టుల వివరాలు ఇలా...

రైల్వే జోన్ ప్రకటించిన ఖాళీలు పెరిగిన ఖాళీల సంఖ్య
సెంట్రల్ రైల్వే 535 1786
 ఈస్ట్ సెంట్రల్ రైల్వే 76  76
ఈస్ట్ కోస్ట్ రైల్వే   479 1595
ఈస్టర్న్ రైల్వే 415 1382
నార్త్ సెంట్రల్ రైల్వే 241 802
నార్త్ ఈస్టర్న్ రైల్వే   43 143
నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే    129 428
నార్తర్న్ రైల్వే 150 499
నార్త్ వెస్టర్న్ రైల్వే 228 761
సౌత్ సెంట్రల్ రైల్వే 585 1949
సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే 1192 3973
సౌత్ ఈస్టర్న్ రైల్వే   300 1001
సదరన్ రైల్వే   218 726
సౌత్ వెస్టర్న్ రైల్వే   473 1576
వెస్ట్ సెంట్రల్ రైల్వే  219  729
వెస్ట్రర్న్ రైల్వే 413  1376
మొత్తం ఖాళీలు 5,696 18,799

RRB ALP CBT 2 Rescheduling Exam Dates 2025..

RRB Exam: అసిస్టెంట్ లోకో పైలట్‌ స్టేజ్-2 పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Embed widget