అన్వేషించండి
Rasmalai Recipe : టేస్టీ స్వీట్ రసమలై రెసిపీ.. సింపుల్‌గా ఇంట్లో చేసుకోండిలా
Rasmalai Sweet Recipe : రసమలై స్వీట్‌ని చాలామంది ఇష్టంగా తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి.
రసమలై రెసిపీ (Image Source : Envato)
1/6

రసమలై స్వీట్‌ని చాలామంది రెస్టారెంట్లో, షాప్‌లలో తింటారు. కానీ దానిని ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ స్వీట్‌ని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
2/6

స్టౌవ్ వెలిగించి మందపాటి కడాయిపెట్టి దానిలో పాలు వేసి మరిగించాలి. అయితే మంటను సిమ్‌లోనే ఉంచాలి. దానిలో స్వీట్ కోసం షుగర్ వేయండి. పంచదార కరిగిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి.
3/6

పాలు చల్లారిన తర్వాత దానిలో నిమ్మరసం లేదా వెనిగర్ వేయాలి. దానిలోని గట్టి మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిని బాగా మిక్స్ చేసి.. మెత్తని ముద్దగా చేసుకోవాలి.
4/6

వాటిని రసమలైగా ఒత్తుకోవాలి. కొందరు చిన్న బాల్స్ రూపంలో చేసుకుంటారు. మరికొందరు రౌండ్‌గా ఒత్తుకుంటారు.
5/6

ఇప్పుడు మరో పాన్ తీసుకుని దానిలో పాలు, చక్కెర, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి మరిగించాలి. ఇప్పుడు దానిలో రసమలైలు వేసుకుని ఉడికించాలి.
6/6

దానిలో పిస్తాలు, బాదం, జీడిపప్పులు పలుకులుగా చేసుకుని వాటితో గార్నిష్ చేసుకోవాలి. స్టౌవ్ ఆపేసి చల్లారిన తర్వాత తింటే రుచి అదిరిపోతుంది.
Published at : 08 Apr 2025 03:24 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















