RCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీ
ఈ సీజన్ లో స్ట్రాంగ్ టీమ్ అంటే ఏది ఢిల్లీ క్యాపిటల్సా లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరా..ఎవరి ఫ్యాన్స్ వాళ్ల టీమ్ పేరు చెప్పుకుంటారు కానీ ఈ సీజన్ లో ఇఫ్పటి వరకూ ఒక్కసారి కూడా ఓడిపోని ఢిల్లీ క్యాపిటల్స్...గుజరాత్ ను మినహాయించి చెన్నై, ముంబై, కోల్ కతా అంటూ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఛాంపియన్లకే షాకిచ్చిన ఆర్సీబీ ఈ రెండు జట్లు ఈ రోజు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏది స్ట్రాంగ్ ఏది వీక్ చెప్పటం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు జరిగేది రెండు కొదమ సింహాల పోరు అని చెప్పొచ్చు. ఢిల్లీ సంగతి తీసుకుంటే ఓపెనింగ్ సమస్య తప్ప మిగిలినదంతూ ఫస్ట్ క్లాస్. ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్ గర్క్ ఫామ్ లోకి వస్తే ఢిల్లీ కోరుకునేది అంతకంటే ఏం లేదు. ఫాఫ్ గాయం నుంచి కోలుకుంటే తనతో పాటు JFM ఓపెనింగ్ చేస్తాడు లేదంటే మొన్నటి లా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ కి వస్తాడు. అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, విప్రాజ్ నిగమ్, అశుతోష్ శర్మ, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తో బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో అక్షర్ కుల్దీప్ కి స్పిన్ సంగతి చూసుకుంటుంటే..మిచెల్ స్టార్క్ కొండంత అండలా పేస్ దళాన్ని నడిపిస్తున్నాడు. మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్ మిగిలిన పేస్ భారాన్ని పంచుకుంటున్నారు. ఇటు ఆర్సీబీ సంగతికి వస్తే ఫిల్ సాల్ట్, కొహ్లీ, పటీదార్, జితేశ్ శర్మ, లియాం లివింగ్ స్టన్, టిమ్ డేవిడ్ ఇలా ఫామ్ లో లేని ఆటగాడిని చూపించలేం. అందరూ ఉరకలెత్తే ఉత్సాహంలో ఉన్నారు. ఇక బౌలింగ్ లో హేజిల్ వుడ్ కి తోడు భువీ తనలోని పాత ఫైర్ ను బయటకు తీస్తున్నాడు. స్పిన్ వచ్చి కాస్త వీక్ గా ఉంది సూయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి స్పిన్ వేస్తున్నాడు కానీ మరో స్పిన్నర్ కావాలంటే పార్ట్ టైమర్ మీద ఆధారపడుతున్నారు. సరే చూడాలి మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలుపు ఎవరిదో గెలిచిన వాడిది తాత్కాలికంగా పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానం సంపాదించుకోవచ్చు కాబట్టి మ్యాచ్ మాత్రం చూచుకుందాం రా మీ పెతాపమో మా పెతాపమో అన్నరేంజ్ లో జరగటం అయితే పక్కా.





















