Jai Hanuman: హనుమాన్‌కి ఈ శనివారం చాలా ప్రత్యేకం.. ఇలా చేస్తే మీ జాతకంలో గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి!
ఆంజనేయుడిని పూజించేందుకు మంగళవారం, శనివారం చాలా ప్రత్యేకంగా భావిస్తారు భక్తులు. ఈ శనివారం హనుమాన్ విజయోత్సవం కావడంతో మరింత ప్రత్యేకం..

Jai Hanuman: వాయుపుత్రుడిని ప్రతి మంగళవారం, శనివారం భక్తిశ్రద్ధలతో పూజిస్తే ధైర్యం, విజయం, అభయం, ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శని దోషంతో బాధపడేవారు శనివారం రోజు ఆంజనేయుడిని పూజిస్తే ఆ దోషం నుంచి విముక్తి పొందుతారని చెబుతారు. ఎందుకంటే శని ప్రభావం నుంచి తప్పించుకోవడం అంటే తేలిక కాదు. కేవలం ముగ్గురు మాత్రం శని దృష్టి తమపై పడనీయకుండా తప్పించుకోగలిగారు. వారిలో ఆంజనేయుడు ఒకడు.
ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహమ్
రామ భక్తుడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మనుంచి వరాలు పొందినవాడు...అంటే ఆంజనేయుడు త్రిమూర్తుల తేజం - స్వరూపం నింపుకున్నవాడని అర్థం. అందుకే నిత్యం హనుమాన్ పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి. కార్యసిద్ధికోసం మంగళవారం, గ్రహదోషాల నుంచి తప్పించుకునేందుకు శనివారం పూజిస్తారు.
ఆంజనేయుడికి పూజచేస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుందో తెలియజేసేందుకు పురాణాల్లో ఓ కథ ఉంది.
రావణుడి చెరలో ఉన్న సీతమ్మను తీసుకొచ్చేందుకు వారధి నిర్మిస్తుంటారు వానరులు. రాళ్లపై రామనామం రాసి నీటిలో వేస్తుంటారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన శనిదేవుడిని చూసి వారధి నిర్మాణంలో సహాయం చేసేందుకు వచ్చాడు అనుకుంటారంతా. కానీ హనుమపై తన దృష్టి ప్రసరించేందుకు వచ్చానని చెబుతాడు శని. తలపైకి ఎక్కి కూర్చుంచాడు. వారధి నిర్మాణానికి అడ్డుగా ఉన్నావ్ స్వామికార్యం పూర్తయ్యే వరకూ తల వదిలి కాళ్ల దగ్గర పట్టుకుని ఉండమని చెబుతాడు ఆంజనేయుడు. సరే అని కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు శని. వెంటనే తొక్కిపెట్టేస్తాడు హనుమాన్. ఆ కాలి కింద నుంచి తప్పించుకోవడం సాధ్యంకాక విలవిల్లాడుతుంటాడు. ఇంకెప్పుడూ నీ జోలికి, నిన్ను పూజించేవారి జోలికి రానని మాటిస్తాడు. అలా శని నుంచి ఆంజనేయుడు తప్పించుకోవడంతో పాటూ తన భక్తులను తప్పించాడని పురాణ కథనం. అందుకే శనివారం రోజు హనుమాన్ ని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందంటారు.
బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్
ఆంజనేయుడి పూజ కేవలం శనిప్రభావం మాత్రమే కాదు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది
ఏడుగురు చిరంజీవుల్లో ఒకడైన హనుమంతుడు ఇప్పటికీ భూమిపై తిరుగుతున్నాడని, ఎక్కడ శ్రీరామ కీర్తనలు వినిపించినా అక్కడ కూర్చుని భజన చేస్తాడని చెబుతారు. అందుకే ఆంజనేయుడిని పూజిస్తే ఆయుష్షు, ఆరోగ్యం, ధైర్యం, విజయం, అభయం సిద్ధిస్తాయి
'జై హనుమాన జ్ఞాన గుణసాగర' అంటూ తులసీదాస్ నోటివెంట అప్రయత్నంగా వచ్చిన హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
హనుమాన్ దండకాన్ని నిత్యం చదివితే దుష్ట శక్తుల ప్రభావం మీపై ఉండదు
ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉండేవారు శనిభాదల నుంచి ఉపశమనం కోసం శనివారం ఆంజనేయుడిని పూజించాలి.
ఈ ఏడాది హనుమాన్ విజయోత్సవం శనివారం వచ్చింది కాబట్టి వేకువజామునే స్నానమాచరించి హనుమాన్ కి యధాశక్తి పూజించండి. ఇంట్లో అవకాశం లేనివారు ఆలయాలకు వెళ్లి ఆంజయేనుడి శ్లోకాలు చదువుకున్నా మంచిదే.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















