Revanth Reddy: యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana: ప్రతి ముఖ్యమంత్రికి ఓ బ్రాండ్ ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.

CM Revanth Young India Brand: రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని, ఐటీ , హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తుకు వస్తారని.. .జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారని అలా ముఖ్యమంత్రులుగా పని చేసిన వారందరికీ ఓ బ్రాండ్ ఉందన్నారు. తన బ్రాండ్ యంగ్ ఇండియా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లామంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ దగ్గర నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
Young India is My Brand
— Congress for Telangana (@Congress4TS) April 10, 2025
ప్రతీ ఒక్కరికీ ఒక బ్రాండ్ ఉంటుంది
🔸రూ.2కే కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్.
🔸ఐటీ అంటే చంద్రబాబు..
🔸జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారు.
కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్ అని గొప్పలు చెప్పుకుంటారు.
యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్#Telangana… pic.twitter.com/jZmDFQOnHN
తన బ్రాండ్ మాత్రం ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతదేశంలోని యువత ప్రపంచ స్థాయిలో సగర్వంగా నిలబడాలనేదే తన లక్ష్యమన్నారు. తెలంగాణ వారు ముందుండాలని .. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. సైనిక్ స్కూల్, ఆర్మీ స్కూల్‌తో పోటీ పడే విధంగా పోలీస్ స్కూల్ తయారవ్వాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఐటీ, ఫార్మా కంపెనీల నుంచి సీఎస్‌ఆర్ నిధులు సేకరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సలహా ఇచ్చారు.
పాఠశాల నిర్మాణం నుంచి పిల్లల యూనిఫామ్ వరకు ప్రతిదాంట్లో సీఎం ప్రత్యేక చొరవ చూపించారు. ప్రారంభోత్సవం అనంతరం తరగతి గదులను సీఎం రేవంత్ పరిశీలించారు. అనంతరం గ్రౌండ్ లో పిల్లలతో కలిసి కొద్దిసేపు ఫుట్ బాల్ ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల్లో ఈ స్కూల్ ను నిర్మించింది. సీ ర్ 2024 అక్టోబర్ 21న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు.
తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, SPF, జైళ్లలో అమరవీరులు.. ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు ఈ స్కూల్ లో సీట్లు కేటాయిస్తారు. మొదటి విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రారంభిస్తున్నారు.
మన రక్షణ కోసం…
— Revanth Reddy (@revanth_anumula) April 10, 2025
అనుక్షణం పహారా కాసే…
పోలీసు సోదరుల
బిడ్డల సంక్షేమం కోసం…
ఒక మంచి ఆలోచనను…
అమలు చేసి కళ్ల ముందు నిలిపాం.
కేవలం ఆరు నెలల్లో…
మంచిరేవుల వద్ద…
“యంగ్ ఇండియా పోలీస్ స్కూల్” ను
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి…
రేపటి పౌరుల భవితను నిర్మించే..
బాధ్యత మేం… pic.twitter.com/8f9CXgzdxg





















