CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో IPL 2025 నుంచి వైదొలగాడు. దీంతో అతని స్థానంలో ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు.

CSK Captain MS Dhoni: ఓటములతో ఇబ్బంది పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ టీంకు ఓ గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ టోర్నీ నుంచి తప్పుకోవడం బ్యాడ్ న్యూస్. అతని స్థానంలో సీఎస్కే కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది తలా అభిమానలకు గుడ్ న్యూస్. CSK కెప్టెన్ ఋతురాజ్ గాయక్వాడ్ మొన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. ఆ తర్వాత జరిగిన ఢిల్లీతో మ్యాచ్‌కు డౌట్ అనే వార్తలు వచ్చాయి. కానీ రుతురాజ్ టాస్‌కు వచ్చాడు.
గురువారం, ఏప్రిల్ 10న ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్ కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నారని చెప్పారు. మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నట్టు స్పష్టం చేశాడు. గైక్వాడ్ వైదొలగడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను 43 ఏళ్ల MS ధోని మరోసారి జట్టుకు నాయకత్వం వహించనున్నారని వివరించారు.
సీఎస్కేను ఐదుసార్లు IPL విజేతగా నిలిచిన కెప్టెన్ ధోని మిగిలిన సీజన్‌కు కెప్టెన్ బాధ్యతలు తీసుకోనున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఈ ప్రకటన చేశారు.
"జట్టు కూర్పు విషయానికొస్తే, జట్టులో మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించలేదు. బాధ్యతలు తీసుకోవడానికి ధోని సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం జట్టు ఏ పరిస్థితిలో ఉందో అతనికి బాగా తెలుసు." అని ఫ్లెమింగ్ అన్నారు.
మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన CSK IPL 2025 మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే వేసిన బంతి గైక్వాడ్ మోచేయిని తాకింది. మోచేయి గాయం ఉన్నప్పటికీ, ఢిల్లీ, పంజాబ్‌తో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌లలో ఆడాడు. అయితే, తాజాగా చేసిన స్కాన్‌లో రుతురాజ్ మోచేయి గాయం పెద్దదైనట్టు తేలింది. దీంతో IPL 2025 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంకానున్నాడు.
"అతను (గైక్వాడ్) గౌహతిలో గాయపడ్డాడు. చాలా నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి X-రే తీశారు, అది అసంపూర్ణంగా ఉండటంతో MRI చేశాం. అతని మోచేయిలో పగులు ఉన్నట్టు తేలింది.
"ఇది తెలిసి చాలా నిరాశ పడ్డాం. అతని పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఆఖరి నిమిషం వరకు ఆడటానికి అతను చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తు, ఇకపై అతను టోర్నమెంట్‌కు దూరంగా ఉంటాడు. "మాకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని ఉన్నాడు, అతను మిగిలిన మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉంటాడు." అని ఫ్లెమింగ్ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.
గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో మూడింటిలో చెన్నై సూపర్ కింగ్స్‌కు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద షాకే అని చెప్పవచ్చు.
ధోని IPL 2023లో సీఎస్కే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో CSK ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి టైటిల్‌ను గెలుచుకుంది. 2022లో ధోని రవీంద్ర జడేజాకు జట్టు కెప్టెన్సీని అప్పగించాడు. కానీ జట్టు పేలవమైన ప్రదర్శన తరువాత అతను మళ్ళీ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. దీని తరువాత 2024లో గాయక్వాడ్‌ను జట్టు కొత్త కెప్టెన్‌గా ఎన్నుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

