Manchu Manoj: 'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
Manchu Manoj Comments: మంచు ఫ్యామిలీలో వివాదాలపై తాజాగా నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ గొడవలు ఆస్తి కోసం కాదని.. తనపై పగ ప్రతీకారాలు తీర్చుకునేందుకే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

Manchu Manoj Comments About Their Family Disputes: తన కుటుంబంలో జరుగుతున్న వివాదం ఆస్తికి సంబంధించింది కాదని ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) అన్నారు. వరుస వివాదాలపై ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇల్లు, ఇతర ఆస్తులపై తనకు ఏ మాత్రం ఇష్టం లేదని మరోసారి స్పష్టం చేశారు.
తప్పుడు కేసులు పెట్టారు
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నించిన తరుణంలోనే గొడవలు మొదలయ్యాయని.. దాదాపు రెండేళ్ల నుంచి ఈ వివాదాలు జరుగుతున్నాయని మనోజ్ తెలిపారు. 'ప్రశ్నించాననే కారణంతో నా గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు వ్యాప్తి చేశారు. నాపై దాదాపు 30 తప్పుడు కేసులు పెట్టారు. నేను కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డాను. ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మా నాన్న సినిమాలన్నింటికీ మా అన్నకు సంబంధించిన సంస్థలే పని చేస్తాయి. 'సన్నాఫ్ ఇండియా' మూవీలోని ఓ పాట గ్రాఫిక్స్‌కు సుమారు రూ.కోటిన్నర ఖర్చు చేశారు.
ఆ గ్రాఫిక్స్ మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసెయ్యొచ్చు. ఈ గొడవల్లోకి అనవసరంగా నా భార్యను లాగారు. అలా చేయకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. తన వల్లే నేను చెడిపోతున్నానంటూ స్టేట్‌మెంట్, ఎఫ్ఐఆర్‌లో నా భార్యాబిడ్డల పేర్లు పెట్టడంతో నా మనసు విరిగిపోయింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎప్పుడూ ఆస్తి అడగలేదు. కాబట్టి దేనీకి భయపడను. నాపై పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికే ఈ దాడులకు పాల్పడుతున్నారు.' అని మనోజ్ తెలిపారు.
Also Read: మరో ఓటీటీలోకి శర్వానంద్ 'మనమే' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
కారు పోయిందనే కంప్లైంట్‌తో..
ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాదం ముదిరింది. గత కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్‌కు.. తన తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో వివాదం జరిగింది. తాజాగా తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం తాను జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని మంచు విష్ణు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లిన మనోజ్.. గేట్ బయటే కూర్చుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తన పెంపుడు కుక్కలు, వస్తువులు ఇంట్లోనే ఉన్నాయని.. వాటిని తీసుకోవడానికే వచ్చానని ఆయన మీడియాకు తెలిపారు. తాను ఊర్లో లేనప్పుడు తన వస్తువులు ఎత్తుకెళ్లారని అన్నారు.
మనోజ్ ఎమోషనల్
డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతుంటే పోలీసులు ఇప్పటివరకూ ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదని.. కోర్టు అనుమతించినప్పటికీ తనను ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని మనోజ్ మీడియాతో చెప్పారు. తన అన్న కెరియర్ కోసం తనను వాడుకున్నాడని.. మా నాన్న కోరిక మేరకు తన అన్న కోసం సినిమాలో ఆడ వేషం కూడా వేశానని వెల్లడించారు. సీఎం రేవంత్ దృష్టికి తన సమస్యను తీసుకెళ్తానని ఇటీవల ప్రెస్ మీట్‌లో మనోజ్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

