అన్వేషించండి

Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ

Andhra Pradesh News | రాజధాని అమరావతిలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. మొత్తం 66 వేల ఫ్లాట్లలో 7 వేల ఫ్లాట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.

Amaravati Land Latest News | అమరావతి: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, మరియు రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ముందుకు వచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ

మౌలిక వసతుల కల్పన, రోడ్ల అనుసంధానం
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రెండేళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా, సీడ్ యాక్సిస్ రహదారిని త్వరలోనే మంగళగిరి రహదారికి అనుసంధానించి అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, భవిష్యత్తులో అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ కూడా చేపడతామని తెలిపారు. లభించే ప్లాట్లకు సంబంధించి లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు ఇచ్చిన వారి సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
 
ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం
అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో పనులు వేగంగా సాగుతున్నాయని, అయితే రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఉన్న 11, 8 జోన్లలో మాత్రమే పనులు మినహాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 66 వేల ఫ్లాట్లలో ఇప్పటికీ 7 వేల ఫ్లాట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లు రోజుకు 30 నుంచి 60 మంది చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
 
450 మంది రైతులకు ఇవ్వాల్సిన 1,891 ఫ్లాట్స్ కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్న కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. విదేశాల్లో ఉన్నవారు, ఇతరత్రా సమస్యలు ఉన్న వారు సైతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా, రోజుకు వెయ్యి రిజిస్ట్రేషన్లు చేసేలా అధికారులను అందుబాటులో ఉంచామని మంత్రి నారాయణ తెలిపారు. రైతులు ముందుకు వచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Advertisement

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Dhandoraa OTT : ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget