Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Delhi court: ఢిల్లీ కోర్టు వద్ద ఓ లాయర్ ను ఓ వ్యక్తి చెప్పుతో కొట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆయన మాజీ సీజేఐ గవాయ్ పై చెప్పులు విసిరిన లాయర్.

Advocate Rakesh Kishore attacked with slippers in Delhi court: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై షూ విసిరిన అడ్వకేట్ రాకేష కిషోర్ పై చెప్పులతో దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేసిన సస్పెన్షన్‌కు సంబంధించి కోర్టులో హాజరైన అనంతరం తెలిసిన కొందరు ఇలా చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ, చట్టపరమైన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
हिंसा का जवाब हिंसा नहीं हो सकता है!
— Prabhakar Kumar Mishra (@PMishra_Journo) December 9, 2025
इनको पहचानिए! ये वही राकेश किशोर हैं जिन्होंने
पूर्व CJI जस्टिस गवई पर जूता फेंका था। ये तस्वीर
दिल्ली के कड़कड़डूमा कोर्ट परिसर की है। pic.twitter.com/XDFECWZK1p
71 సంవత్సరాల వయస్సు కలిగిన అడ్వకేట్ రాకేష్ కిషోర్, అక్టోబర్ 6న సుప్రీంకోర్టు కోర్టు నంబర్ 1లో మెన్షనింగ్ సమయంలో మాజీ సిజేఐ బీఆర్ గవైపై చెప్పు విసరడం సంచలనం సృష్టించింది.చెప్పు దూరంగా పడింది. ఈ ఘటనకు సంబంధించి కిషోర్‌ను కొంతసేపు అరెస్టు చేసినప్పటికీ, కేసు పెట్టాల్సిన అవసరం లేదని సీజేఐ రిజిస్ట్రార్ జనరల్‌కు సూచించడంతో అదే రోజు విడుదల చేశారు. అయితే, బీసీఐ కొర్టు గౌరవానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు కిషోర్‌పై సస్పెన్షన్ వేసింది.
सीजीआई गवई जी के ऊपर जूते से हमला करने वाला राकेश किशोर के ऊपर भी किसी ने जूते से हमला किया और ये काम करके बहुत अच्छा किया...
— Nishu Aazad (@Nishuazad11) December 9, 2025
जूते से मार खा लेंगे गोबर खा लेंगे नाली का पानी पी लेंगे लेकिन सनातन धर्म का अपमान नहीं सहेंगे।😂😂 (Rakesh kishore..)
ये महान काम करने वाले व्यक्ति को… pic.twitter.com/xc5yjiDtze
డిసెంబర్ 9న కార్కర్దూమా కోర్టులో సస్పెన్షన్‌కు సంబంధించి హాజరైన కిషోర్‌పై ఎవరో తెలియని వ్యక్తులు చెప్పులతో దాడి చేశారు. వారిలో 35-40 సంవత్సరాల వయస్సు గల ఒక యువ న్యాయవాది కూ ఉన్నారు.
Manuwadi Lawyer Rakesh Kishore — the man who once hurled a shoe at former CJI B.R. Gavai — was thrashed with slippers inside a Delhi court today. The dramatic retaliation unfolded in full public view, sending shockwaves through the legal fraternity. pic.twitter.com/iPXwvj9UR9
— The Dalit Voice (@ambedkariteIND) December 9, 2025
ఈ ఘటనపై లాయర్ కిషోర్ భిన్నంగా స్పందించారు. ఇది తమ అంతర్గత విషయమన ిచెప్పుకున్నారు.




















