Thailand Budget Travel : థాయ్ బాట్ vs భారత రూపాయి.. థాయిలాండ్ వెళ్లాలనుకుంటే ఫ్లైట్స్ నుంచి హోటల్స్ వరకు పూర్తి డిటైల్స్
Thailand Trip : థాయ్‌లాండ్‌కు ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా ? అయితే అక్కడ రూపాయి విలువ ఎంతో.. అక్కడ లక్ష సంపాదిస్తే ఇక్కడ దాని విలువ ఎంత ఉంటుందో వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.

Best Budget-Friendly Destination Thailand : ప్రపంచంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి థాయిలాండ్. హాలీడేస్లో చాలామంది ఇక్కడి నుంచి థాయిలాండ్ వెళ్తారు. ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే.. బడ్జెట్ తక్కువలో ఫ్యామిలీ ట్రిప్ వేయాలనుకుంటే ఇది చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు థాయిలాండ్ వెళ్తారు. ఇక్కడి కరెన్సీ గురించి మాట్లాడితే.. ఇక్కడ భారతీయ రూపాయి విలువ ఎక్కువగానే ఉంటుంది. వైస్ డాట్ కామ్ నివేదిక ప్రకారం.. 1 థాయ్ బాట్ (THB) ధర దాదాపు 2.83 ఇండియన్ రూపాయి.
ఒక భారతీయుడు థాయిలాండ్‌లో పని చేసి నెలకు దాదాపు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే.. భారతదేశానికి వచ్చిన తర్వాత దాని విలువ 2 లక్షల 82 వేలు అవుతుంది. ఈ లెక్కన థాయిలాండ్‌లో సంపాదించిన డబ్బు భారతదేశానికి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. దీనితో పాటు.. ఒక భారతీయుడు థాయిలాండ్‌కి లక్ష రూపాయలు తీసుకుని వెళితే.. అక్కడ దాని విలువ 35, 376 రూపాయలు అవుతుంది.
థాయిలాండ్ కరెన్సీ
థాయిలాండ్ అధికారిక కరెన్సీని థాయ్ బాట్ అంటారు. దీనిని వంద సతాంగ్‌లుగా విభజించారు. ఈ కరెన్సీ మొత్తం వ్యవస్థ, కంట్రోల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ ఆధీనంలో ఉంటుంది. భారతీయ యాత్రికులు కొంత స్థానిక కరెన్సీని ముందుగానే మార్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రారంభ ఖర్చులలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
భారతీయ పర్యాటకుల రికార్డు సంఖ్య
థాయిలాండ్‌పై భారతీయ పర్యాటకులకు ఆకర్షణ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరంలోనే దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది భారతీయులు వెళ్లారు. చైనా, మలేషియా తర్వాత, భారతదేశం థాయిలాండ్‌కు అతిపెద్ద పర్యాటక మార్కెట్‌గా చెప్తారు. ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థకు కూడా గొప్ప మద్దతునిస్తుంది. యూరప్ కంట్రీల నుంచి కూడా ఎక్కువమంది వస్తారు.
ఖర్చులు ఎలా ఉంటాయంటే..
ఇండియన్ కరెన్సీతో చూసుకుంటే.. ఒక హాస్టల్ రూమ్ ధర రోజుకి 2 వేలు ఉంటుంది. సింగిల్‌గా వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫ్యామిలీతో లేదా గ్రూప్స్‌గా ఉండాలనుకుంటే హొటల్ రూమ్స్ తీసుకోవచ్చు. ఒక డబుల్ బెడ్ రూమ్ రెంట్ రోజుకి 8 వేలు ఉంటుంది. దాదాపు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఫుడ్ విషయంలో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే.. 120 నుంచి 150 ప్లేట్ వరకు ఉండొచ్చు. కేవలం బీచ్‌లే కాకుండా.. టెంపుల్స్‌కి, నైట్ స్ట్రీట్ లైఫ్ చూసేందుకు వెళ్లొచ్చు. తక్కువ ఖర్చులోనే వీటిని చూడవచ్చు. మీరు ఈ ఏడాది ముగిసేలోపు వెళ్లలనుకుంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. ఫ్లైయిట్ కాస్ట్ కూడా 8 వేల నుంచి 10 వేల లోపే బుక్ చేసుకోవచ్చు.






















