వాటికన్ సిటీ కేవలం 049 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఒక సాంస్కృతిక కేంద్రం. సెయింట్ పీటర్స్ బసిలికా, సిస్టీన్ చాపెల్లకు నిలయం. ఈ దేశం కళ, చరిత్ర, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది.
మొనాకో ఫ్రెంచ్ రివేరాలో 2.1 చదరపు కిలోమీటర్ల ఆటస్థలం. ఇది కాసినోలు, యాచ్‌లు, గ్రాండ్ ప్రిక్స్, ఎలైట్ నైట్‌లైఫ్‌తో నిండి ఉంటుంది.
నౌరు ఒక ద్వీప దేశం. ఇక్కడ స్వచ్ఛమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు, స్థానిక జీవితం లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. కేవలం 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గమ్యం.. ప్రయాణికులకు విభిన్న అనుభావాలు ఇస్తుంది.
కేవలం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తువాలు ఉంది. ఇక్కడ స్పష్టమైన నీటి సరస్సులు ఉంటాయి. పర్ఫెక్ట్ ద్వీప అనుభూతిని అందిస్తుంది. పాలినేషియన్ సంస్కృతి, తీరప్రాంతం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ 61 చదరపు కిలోమీటర్ల శాన్ మారినో.. పర్వత ప్రాంతంతో అద్భుతమైన వీక్షణలు అందిస్తుంది. మధ్యయుగపు టవర్ల ఉంటాయి. ఇక్కడ ప్రయాణికులు ఇటాలియన్ వంటకాలను ఆస్వాదించవచ్చు.
ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య ఉన్న లిఖ్టెన్‌స్టెయిన్ 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దేశం. ఇక్కడ మంచు క్రీడలు, పర్వత మార్గాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అద్భుతమైన కోటలు చూడొచ్చు.
మార్షల్ దీవులు 29 పగడపు దిబ్బలపై విస్తరించి ఉన్నాయి. ఈ 181 చదరపు కిలోమీటర్ల దేశంలో పర్యాటకులకు డైవింగ్, సముద్రంలో చేపల వేట చేయవచ్చు. ఇది WWII శిథిలాలను నీటి అడుగున అన్వేషించడంలో మంచి అనుభూతిని ఇస్తాయి.
ఇక్కడ అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన నల్ల ఇసుక బీచ్‌లు, చారిత్రక శిథిలాలు, పచ్చని పర్వతాలను అందించే కరేబియన్ దీవులు ఆకట్టుకుంటాయి. 261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ విశ్రాంతి, సాహసాలను కోరుకునేవారికి అనువైనవి.
ఫ్లోటింగ్ విల్లాలు, నీలిరంగు నీటితో ప్రసిద్ధి చెందిన మాల్దీవులు.. మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్వర్గంలో డైవింగ్, హిందూ మహాసముద్రంపై సూర్యాస్తమయాలు ఆకట్టుకుంటాయి.
ఆండొరా 468 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉంటుంది. హైకింగ్, స్కీయింగ్, టాక్స్ లేని షాపింగ్కు స్వర్గధామం. ఇది పిరనియన్ శిఖరాలతో చుట్టుముట్టి ఉంటుంది.