మిగిలిపోయిన చపాతీలను రుచికరమైన వంటకాలుగా మార్చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/kedarjadhavofficial

చపాతి నూడుల్స్

మిగిలిపోయిన చపాతీలను కూరగాయలు, సోయా సాస్, మసాలా దినుసులతో కలిపి దేశీ స్టైల్ నూడిల్స్ వంటకం తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, త్వరగా తయారుచేసుకోగలిగే వంటకం కూడా. మధ్యాహ్న భోజనం లేదా సాయంత్రం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు.

Image Source: Pinterest/indiancurrytrail

చపాతీ కోతు పరోటా

ఇది ఒక రుచికరమైన దక్షిణ స్ట్రీట్ స్టైల్ ఫుడ్. ఇది సాంప్రదాయకంగా పొరల పరొటాలతో తయారు చేస్తారు. మిగిలిపోయిన చపాతీలను దీనికోసం ఉపయోగిస్తారు. టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులతో వేయిస్తారు.

Image Source: Pinterest/kannammacooks

రోటీ లడ్డూ

మిగిలిపోయిన రోటీలను మెత్తగా రుబ్బుకుని. బెల్లం, నెయ్యి, గింజలతో కలిపి లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇది పోషకాలు అధికంగా కలిగిన స్వీట్. దీనిని హెల్తీ డిజర్ట్​గా తీసుకోవచ్చు.

Image Source: Pinterest/tarladalal

వాఘరేలి రోటి

వఘరేలి రోటి అనేది గుజరాతీ వంటకం. మిగిలిపోయిన చపాతీలను హాయిగా భోజనంగా మార్చుకోవచ్చు. దీనిని అల్పాహారంగా లేదా తేలికపాటి రాత్రి భోజనంగా కూడా తినొచ్చు.

Image Source: Pinterest/archanaskitchen

రోటీ చివడ

చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసి.. క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. కరివేపాకు, వేరుశెనగ, మసాలా దినుసులతో కలిపి, క్రంచీ, ఆరోగ్యకరమైన స్నాక్ తయారు చేసుకోవచ్చు.

Image Source: Pinterest/seemadoraiswamy

రోటీ పిజ్జా

చపాతీ పైన సాస్, కూరగాయలు, చీజ్ వేసుకోవాలి. తవా లేదా ఓవెన్లో కాల్చుకోండి. ఇది పిజ్జా కోరికలను తీర్చే రుచికరమైన ఫ్యూజన్.

Image Source: Pinterest/sharmispassions

చపాతీ ఆమ్లెట్

చపాతీ ఆమ్లెట్ అనేది మిగిలిపోయిన రొట్టెలను చిన్న ముక్కలుగా చేసి ఆమ్లెట్ మిశ్రమంలో వేసి.. బాగా కలిపి.. తయారు చేసే ఒక ఆరోగ్యకరమైన వంటకం. ఇది ఒక తెలివైన జీరో-వేస్ట్ వంటకం. ఇది దేశీ రుచిని కలిగి ఉంటుంది.

Image Source: Pinterest/kannammacooks

సేయల్ ఫుల్కా

సేయల్ ఫుల్కా సింధీ వంటకం. ఇది కారంగా ఉండే అల్పాహారంగా లేదా చిరుతిండిగా తీసుకోవచ్చు. ఇది రుచికరంగా చేయడానికి టొమాటో, అల్లం, మసాలా దినుసులతో వాడుతారు.

Image Source: Pinterest/harshiljani2002

రోటీ క్వెసాడిల్లా

మిగిలిపోయిన రోటీని రుచికరమైన ఇండియన్ స్టైల్ క్వెసాడిల్లాగా మార్చుకోవచ్చు. కూరగాయలు, చీజ్, మసాలా దినుసులతో దానిని స్టఫ్ చేసి.. బేక్ చేయవచ్చు. సంతృప్తికరమైన ట్రీట్ కోసం పాన్ మీద క్రిస్పీగా అయ్యే వరకు టోస్ట్ చేసుకోవచ్చు.

Image Source: Pinterest/madhuseverydayindian