నానబెట్టిన ఎండుద్రాక్షలో పీచు అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నయం చేస్తుంది.
ఐరన్ అధికంగా ఉండే ఎండుద్రాక్షలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. రక్తహీనతతో ఇబ్బంది పడేవారు తింటే మంచిది.
పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి కాబట్టి.. ఇవి రక్తపోటును కంట్రోల్ చేసి.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కాల్షియం, బోరాన్ పుష్కలంగా ఉన్న నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.
నానబెట్టిన ఎండుద్రాక్ష మీ శరీరంలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పోషకాలు అన్ని శరీరానికి అందుతాయి.
ఐరన్ అధికంగా ఉండే ఎండుద్రాక్ష స్కాల్ప్‌కు రక్త ప్రసరణను పెంచుతుంది. కుదుళ్లకు బలాన్ని అందించి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
నానిన ఎండుద్రాక్షలు ఉదయాన్నే తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలసట తగ్గుతుంది.
ద్రాక్షలో ఉండే టార్టారిక్ ఆమ్లం.. కాలేయంలో పిత్త ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.