కాకరకాయ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి లాభమే కాదు.. నష్టం కూడా ఉందట.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కాకరకాయ జ్యూస్ చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని భావిస్తారు.

Image Source: pexels

ఇందులో విటమిన్ బి1, బి2, బి3, ఫోలేట్, జింక్ ఐరన్, కాల్షియం, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Image Source: pexels

కాబట్టి కాకరకాయ రసం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ప్రతిరోజు తాగితే మీ శరీరానికి హాని కలిగించవచ్చు.

Image Source: pexels

అలాంటప్పుడు కాకరకాయ రసం తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

Image Source: pexels

కాకరకాయ రసం తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువయ్యే సమస్య ఉండవచ్చు.

Image Source: pexels

కాకరకాయ రసంలో ఉండే మోనోచారిన్ ఎంజైమ్ పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కలిగిస్తాయి.

Image Source: pexels

అంతేకాకుండా గర్భధారణ సమయంలో కాకరకాయ రసం తీసుకోకూడదు. ఎందుకంటే ఇది గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

Image Source: pexels

కాకరకాయ రసం ఎక్కువగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినవచ్చు. దీనివల్ల అతిసారం, అజీర్ణం, ఎసిడిటీ, కడుపులో సమస్యలు రావచ్చు.

Image Source: pexels

అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు కాకరకాయ రసం తీసుకోకూడదు. ఎందుకంటే కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.

Image Source: pexels

కాకరకాయ రసం తాగడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. కాబట్టి తక్కువ హిమోగ్లోబిన్ సమస్య ఉన్నవారు కాకరకాయ రసం తీసుకోకూడదు.

Image Source: pexels