ఈ లక్షణాలు విటమిన్ లోపానికి సంకేతాలు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

మంట

పాదాలు లేదా నాలుకలో మంటగా అనిపిస్తుంది. ఇది విటమిన్ బి-12 లోపానికి సంకేతం. కొన్నిసార్లు పొడి చర్మం లేదా అభిజ్ఞా మార్పులతో కూడా ఉంటుంది.

Image Source: freepik

బలహీనమైన జుట్టు

బయోటిన్ లోపం వల్ల.. గోర్లు, జుట్టు పెళుసుగా మారుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో లేదా జీర్ణ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో ఎక్కువగా ఉంటుంది.

Image Source: freepik

నోటి పూత

విటమిన్ బి లేదా ఐరన్ లోపం వల్ల నోటి మూలల్లో పుండ్లు లేదా పగుళ్లు ఏర్పడుతాయి. దీనిని యాంగ్యులర్ చీలిటిస్ అంటారు.

Image Source: Canva

చిగుళ్ల రక్తం

విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ళు సులభంగా రక్తం కారుతాయి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఇది కంట్రోల్ అవుతుంది.

Image Source: Canva

దృష్టి లోపం

విటమిన్ ఎ లోపం వల్ల రేచీకటి, కళ్ళపై తెల్లటి మచ్చలు (బిటాట్స్ మచ్చలు) ఏర్పడవచ్చు.

Image Source: Canva

చుండ్రు

విటమిన్లు, పోషకాల లోపం, ముఖ్యంగా జింక్, నియాసిన్, రిబోఫ్లేవిన్ తగ్గితే చుండ్రు, సెబోరోయిక్ వంటి చర్మ సమస్యలు వస్తాయి.

Image Source: freepik

జుట్టు రాలడం

ఇనుము, జింక్, బయోటిన్, కొవ్వు ఆమ్లాల లోపం వల్ల జుట్టు పలుచబడుతుంది. పూర్తిగా ఊడిపోవడానికి కారణం కావచ్చు.

Image Source: Canva

చర్మంపై ఎరుపుదనం

చర్మం గరుకుగా మారడం, ఎరుపుదనం వంటివి కెరటోసిస్ పిలారిస్, విటమిన్ ఎ లేదా సి లోపం వల్ల వస్తుంది.

Image Source: Canva

కాళ్ల నొప్పులు

విటమిన్, ఐరన్ లోపం వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఈ సమస్యను తగ్గించవచ్చు.

Image Source: Canva