Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo: ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టిన ఇండిగో ఎయిర్ లైన్స్ పై చర్యలు ప్రారంభమయ్యాయి. ఎంత పెద్ద ఎయిర్ లైన్ సంస్థ అయినా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ లోక్ సభలో స్పష్టం చేశారు.

IndiGo being held accountable : ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ఫ్లైటు క్యాన్సిలేషన్లు, ప్రయాణికుల అసౌకర్యాలపై కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కి. రామ్ మోహన్ నాయుడు లోక్‌సభలో తీవ్రంగా స్పందించారు. ఇండిగో బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎంత పెద్ద ఎయిర్‌లైన్ అయినా, ప్లానింగ్ వైఫల్యాలు, చట్టాలకు అనుగుణంగా నడవకపోవడం ద్వారా ప్రయాణికులకు కష్టాలు కలిగించడానికి అనుమతించరని మంత్రి స్పష్టం చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగోకు షో-కాజ్ నోటీసులు జారీ చేసి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల భారీ ఫ్లైటు క్యాన్సిలేషన్లు, ఆపరేషనల్ డిస్‌రప్షన్లతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. నవంబర్‌లో 64,346 సర్వీసులు అప్రూవల్ పొందినప్పటికీ, కేవలం 59,438 సర్వీసులు మాత్రమే నడిచాయి. దీంతో 951 క్యాన్సిల్ అయ్యాయి. ఇండిగో తన షెడ్యూల్‌లను సమర్థవంతంగా నడపలేకపోతోంది అని డీజీసీఏ తీవ్రంగా ఆరోపించింది. దీని పరిణామంగా, డీజీసీఏ ఇండిగో సీనియర్ లీడర్‌షిప్‌కు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అదనంగా, డిసెంబర్ 10, మధ్యాహ్నం 5 గంటలకు ముందు ఇండిగో డైలీ షెడ్యూల్‌ను 5 శాతం తగ్గించి సమర్పించాలని ఆదేశించింది.
లోక్‌సభలో మంగళవారం మాట్లాడిన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఇండిగో ఆపరేషన్లు స్థిరపడుతున్నాయి. దేశవ్యాప్తంగా మిగతా ఎయిర్‌లైన్‌లు సాధారణంగా నడుస్తున్నాయి. ఎయిర్‌పోర్టుల్లో అంతా సాధారణంగా ఉందని చెప్పారు. ఇండిగోపై డీజీసీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 15 వరకు క్యాన్సిల్ అయిన ఫ్లైటులకు రిఫండ్‌లు త్వరగా చేయాలని ఆదేశించారు. ఇండిగో ఇప్పటికే రూ. 827 కోట్లు ప్రయాణికులకు తిరిగి చెల్లించిందని, మిగిలినవి ప్రాసెసింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ప్రయాణికులను ఆర్థికంగా దోపిడీ చేయకుండా ఫేర్ క్యాప్స్ విధించామని, ఇండిగో ఎక్స్‌ట్రా చార్జీలు లేకుండా రీబుకింగ్‌లు చేస్తోందని మంత్రి చెప్పారు. వింటర్ షెడ్యూల్‌కు ఇండిగో పూర్తి సిద్ధంగా ఉందని, ఫ్లైట్ డ్యూటీ నార్మ్స్‌కు పూర్తి అనుగుణంగా నడుస్తుందని హామీ ఇచ్చారు. భారత ఏవియేషన్ సెక్టార్‌ను మరింత ప్రయాణికులకు కేంద్రీకృతంగా మార్చే దీర్ఘకాలిక చర్యలు చేపట్టాం అని పేర్కొన్నారు. భారతదేశంలో కొత్త ఎయిర్‌లైన్‌లు ప్రవేశించేలా ప్రోత్సహిస్తూ, బలమైన, పోటీతత్వం కలిగిన ఏవియేషన్ ఎకోసిస్టమ్ నిర్మించుతామని చెప్పారు.
Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu on FDTL guidelines and #IndiGoCrisis:
— All India Radio News (@airnewsalerts) December 9, 2025
🎙️"Safety in civil aviation is completely non-negotiable," says @RamMNK. @MoCA_GoI | @DGCAIndia | @Pib_MoCA#WinterSession | #ParliamentWinterSession2025 pic.twitter.com/hmPsEYU1av
మంత్రి వ్యాఖ్యల తర్వాత విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో లోక్‌సభ నుంచి వాక్‌ఔట్ చేశాయి. ఇండిగో సంక్షోభంపై మరింత వివరణలు కావాలని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.





















