అన్వేషించండి

Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?

Madhavaram Krishna Rao: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసివ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమెను కుక్కతో పోల్చారు ఎమ్మెల్యే.

Kukatpally MLA Madhavaram Krishna Rao made harsh comments on Kalvakuntla Kavitha:  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  ఎమ్మెల్సీ కె. కవితపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కవిత ఇటీవల కూకట్‌పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనలో హైదరాబాద్ ఎమ్మెల్యేలను 'బీ.టీ. బ్యాచ్' అని విమర్శించడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. కవిత చరిత్ర హీనురాలు, మంత్రి పదవులు అమ్ముకున్నారు, భూముల దోపిడీలు చేశారు, పార్టీలో కుట్రలు పన్నారు అంటూ పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్  మర్యాద కోసం ఊరుకుంటున్నాను, ఇక సహనంతో ఉండేది లేదని హెచ్చరించారు.
 
తెలంగాణ జాగృతి ( అధ్యక్షురాలు కె. కవిత, గురువారం కూకట్‌పల్లిలో 'జన జాగృతి జనం బాట' పర్యటనలో హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరంలో ఉండే ఎమ్మెల్యేలు 'బీ.టీ. బ్యాచ్'  లా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు చెప్పుకుంటున్నారు కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు అని ఆరోపించారు.  ఈ వ్యాఖ్యలకు స్పందించిన మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.  తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి నడుస్తున్నామని, నగరంలో ఉండే ఎమ్మెల్యేలు 'బీ.టీ. బ్యాచ్' అని చెప్పడం దారుణమని విమర్శించారు. "ఉద్యమంలో పనిచేయకపోయినా, తాము అందరం తెలంగాణ కోసం పని చేశాం. మేము ఉద్యమం చేశామని ఎప్పుడూ చెప్పుకోలేదు" అని స్పష్టం చేశారు.
 
మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. "తెలంగాణ చరిత్రను లిక్కర్ పేరుతో నాశనం చేసావు. తెలంగాణ చరిత్ర హీనురాలు కవిత. చివరకు ఇంట్లో కుక్క పేరు విస్కీ పెట్టుకుంది ఎమ్మెల్సీ కవిత" అని ఎగతాళి చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన స్థాయి కవితకు లేదని, "నీ లాంటి కుక్కలు చాలామంది ఇక్కడికి వచ్చి మెరిగి పోయారు" అని తిట్టారు. కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదని, కవిత బండారం బయటపెట్టితే తెలుస్తుందని హెచ్చరించారు.  బాలానగర్‌లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని ఓవర్‌ల్యాప్ ల్యాండ్‌ను పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నారని ఆరోపించారు. పార్టీ పేరుతో 36 ఎకరాల భూమిని దోచుకున్నారని కూడా చెప్పారు.  పార్టీ లోపల కుట్రలు చేస్తోందని, హరీష్ రావును పార్టీ నుండి వెళ్లగొట్టాలన్నదే కవిత టార్గెట్. కేటీఆర్‌ను ఏదో విధంగా అరెస్ట్ చేయించాలనే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టింది  అని ఆరోపించారు. 

మాధవరం వ్యాఖ్యలపై కవిత పరోక్షంగాస్పందించారు. అధికారం కోల్పోయాక దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు అని.. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరని హెచ్చరించారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Kavitha New Party: సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
Embed widget