ఫోర్త్ సిటీ కాదు..ఫ్యూచర్ సిటీ! 4 అంటే మరణం, అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఈ పేరు ఖరారు చేశారా?
Asian Culture: ఫోర్త్ సిటీ అనొద్దు.. ఫ్యూచర్ సిటీ! సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 అంటే అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఫోర్త్ సిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ అని ఫిక్స్ చేశారా?

Future City
నంబర్ 4 ని అపశకునంగా ఎందుకు భావిస్తారు?
ఆసియా దేశాల్లో 4 నంబర్ అశుభానికి సూచనగా చూస్తారా?
అందుకే ఫోర్త్ సిటీ అని కాకుండా ఫ్యూచర్ సిటీ అని పేరు మార్చారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆంతర్యం ఇదేనా?
రోజువారీ జీవితంలో సంఖ్యలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటి నంబర్ నుంచి ఫోన్ నంబర్ వరకూ ప్రతి విషయంలోనూ సంఖ్యలు చాలా ప్రధానం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం నంబర్ 4 గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని సంస్కృతులతో పాటూ ఆసియా దేశాల్లో నాలుగు సంఖ్యను అపశకునంగా, అశుభంగా భావిస్తారట.
చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి చోట 4 అంటే మరణం గుర్తుకు వస్తుందట. ఈ భాషల్లో నాలుగు అనే పదం మరణం అనే పదంతో సమానమైన ధ్వని కలిగి ఉంటుంది.
చైనీస్ సంస్కృతిలో 'ఫోర్' (sì) అని ఉచ్చరిస్తారు.. ఇది 'డెత్' (sǐ)తో దాదాపు ఒకేలా ధ్వని వస్తుంది. అందుకే ఇంటి నంబర్, ఫోన్ నంబర్, కారు రిజిస్ట్రేషన్ నంబర్లో 4 రాకుండా చూసుకుంటారు. అంతెందుకు ఎలివేటర్స్ లో కూడా 4వ అంతస్తు ఉండదట.. 3A, 3B అని పిలుస్తారట.
జపాన్‌లో 'షి' (shi) అని చెప్పడం 'మరణం' (shi)తో సమానంగా భావిస్తారు. ఇక్కడైతే హాస్పిటల్స్, హోటల్స్ లోనూ 4వ అంతస్తు పేరు మార్చడం కానీ, పూర్తిగా వదిలేయడం కానీ జరుగుతుందట. చైనా కన్నా జపాన్ లో ఫోర్త్ నంబర్ భయం చాలా ఎక్కువ.
హాంకాంగ్, తైవాన్ వంటి చోట్ల కూడా ఇదే పద్ధతి... బీజింగ్ లో అయితే కారు నంబర్లో పొరపాటున కూడా 4 రాకుండా చూసుకుంటారు. ఇది ట్రాఫిక్, వాహనప్రమాదాలను కూడా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే నంబర్ 4 నిజంగా అపశకునమా?
హిందూ, బౌద్ధ, తావోయిజం వంటి ఆసియా మతాల్లో సంఖ్యలు సర్గీయ సందేశాలను సూచిస్తాయని నమ్ముతారు. 4 అనేది మార్పు, పునర్జన్మ గురంచ చెబుతుందంటారు. బౌద్ధ ధర్మంలో 4 దార్శనిక సత్యాలున్నాయి అవే దుఃఖం, దుఃఖ కారణం, దుఃఖ నిరోధం, మార్గం. ఇక్కడ నాలుగు దుఃఖాన్ని అంగీకరించి మోక్షానికి దారి చూపిస్తుంది
భారతీయ సంస్కృతిలో 4 నంబర్ ను పాజిటివ్ గా చూస్తారు.
నాలుగు దిక్కులు ( తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం)
నాలుగు వేదాలు ( ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,అథర్వణవేదం)
నాలుగు యుగాలు (సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం)
అయితే..ఆసియా భాషా ప్రభావం వల్ల నంబర్ 4 అపశకునంగా మారింది.
ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతున్నారంటే...!
సంఖ్యలు మన మనస్సుని మ్యాజిక్ చేస్తాయి.. 4 మనల్ని భయపడమని కాదు జీవితంపై బ్యాలెన్స్ ను కోల్పోవద్దని గుర్తుచేస్తుంది. ఆధ్యాత్మికంగా ఫోర్ అంటే ఫోర్డ్ వర్డ్...ముందుకు సాగు అని చూడొచ్చు. అంటే మరణ భయాన్ని జయించి కొత్త జీవితానికి దారి వెతుక్కో అని అర్థం. మనదేశంలో కొందర నంబర్ 13 ని అపశకునంగా చూస్తారు..మరికొందరు 7ని అపశకునంగా భావిస్తారు
ఫోర్త్ సిటీ అని కాకుండా ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి ఎందుకు ఫిక్స్ చేశారు?
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత వస్తోన్న నగరం కాబట్టి ఫోర్త్ సిటీ అని అధికారులు భావించారు. అయితే ఆ పేరు అపశకునం అని , యాంటీ సెంటిమెంట్ అని కొందరు అధికారులు తమ అభిప్రాయం చెప్పారట. అందుకే రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అని కాకుండా ఫ్యూచర్ సిటీ పేరు ఖరారు చేశారని తెలుస్తోంది. ఇలాంటి సెంటిమెంట్స్ ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్ముతున్నారని కాదు... మన దగ్గర కాకుండా ఆసియా సంస్కతుల్లో 4 నంబర్ అపశకునంగా భావిస్తారు కదా. హైదరాబాద్... చైనా, జపాన్ వంటి దేశాలతో ఎక్కువగా బిజినెస్ చేస్తుంది. ఫోర్త్ సిటీ అని పిలిస్తే విదేశీ ఇన్వెస్టర్లు భయపడి పెట్టుబడులు తగ్గించే అవకాశం ఉండొచ్చు..అందుకే ఆ దిశగా ఆలోచించి ఫ్యూచర్ సిటీ అని నిర్ణయించారని తెలుస్తోంది
ఇది చిన్న మార్పు మాత్రమే.. కేవలం సంస్కతులు, భావోద్వేగాలు పరిగణలోకి తీసుకుని, సానుకూల భవిష్యత్ కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు





















