Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు సులభంగా ధనం సంపాదించేస్తారు! సంఖ్యాశాస్త్రం ప్రకారం డబ్బు సంపాదించే రహస్యాలు!
Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించినవారు త్వరగా డబ్బు సంపాదిస్తారు. ఆ సంఖ్యలు ఏంటో..మీరు జన్మించింది ఈ తేదీల్లోనేనా ? తెలుసుకోండి.

Numerology money making numbers: సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ప్రతి నంబర్ లోనూ ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుంది, కానీ వేగంగా డబ్బు సంపాదించే ప్రతిభ కొద్దిమందిలోనే ఉంటుంది. ఇక్కడ అదృష్టం కంటే స్వభావం, నిర్ణయాలు తీసుకునే వేగం, అవకాశాలను గుర్తించే సామర్థ్యం చాలా ముఖ్యం.
ఏ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతారో తెలుసుకుందాం?
నంబర్ 1 (1, 10, 19, 28)
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు.. స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు, ధైర్యవంతులు, డబ్బు సంపాదించడంలో దిట్ట. వీరు అవకాశాల కోసం ఎదురుచూడకుండా పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వ్యాపారం, నిర్వహణ, మీడియా , రాజకీయాలలో వేగంగా పేరు డబ్బు సంపాదిస్తారు. ఇదంతా నిర్ణయం తీసుకునే సామర్థ్యం , కష్టపడి పనిచేయడం వల్లనే సాధ్యమవుతుంది.
వీరి ప్రత్యేకతలు ఇవే
స్వయం విశ్వాసం
నిర్ణయం తీసుకునే సామర్థ్యం
పదవి ,అధికారాన్ని త్వరగా పొందడం
నంబర్ 3 (3,12,21,30)
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తుల అసలైన బలం నెట్‌వర్కింగ్ , సమయపాలన. వీరి ఆదాయం తరచుగా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచే అవకాశాలను వీరు అందిపుచ్చుకుంటారు.
వీరి ప్రత్యేకతలు ఇవే
సరైన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండటం
సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం
ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట
నంబర్ 5 (5,14, 23)
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు డబ్బు సంపాదించే సంఖ్యగా పరిగణిస్తారు. వీరికి డబ్బు సంపాదించడానికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయి.
ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు.
మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగి ఉంటారు.
మారుతున్న వాటితో పాటు తమలో తాము మార్పులు చేసుకుంటారు.
ఈ తేదీల్లో జన్మించినవారు ఫైనాన్స్, ట్రేడింగ్, మార్కెటింగ్, సేల్స్ , వ్యాపారంలో వేగంగా డబ్బు సంపాదిస్తారు. వీరు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడంలో దిట్ట.
నంబర్ 6 (6,15,24)
సంఖ్యాశాస్త్రం ప్రకారం, డబ్బు సంపాదించే విషయంలో మూలాంకం 6 కలిగిన వారి స్వభావం కష్టపడి పనిచేయడంతో పాటు ఇతరులను ప్రభావితం చేయడంపై ఆధారపడి ఉంటుంది.
వీరి ప్రత్యేకతలు
ఆదాయానికి సృజనాత్మక మార్గాలు
భాగస్వామ్య వ్యాపారంలో లాభం
ప్రజలపై మంచి ప్రభావం
ఈ తేదీల్లో జన్మించిన వారు రియల్ ఎస్టేట్, ఆర్ట్, ఫ్యాషన్, మీడియా, డిజైనింగ్ రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. వీరికి డబ్బు చాలా సులభంగా వస్తుంది.
నంబర్ 8 (8,17,26)
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో జన్మించినవారు డబ్బు సంపాదించే విషయంలో వేగంగా రాణించకపోవచ్చు, కానీ ఒకసారి లక్ష్యంపై దృష్టి పెడితే, ఆదాయంలో మంచి వృద్ధిని సాధిస్తారు.
వీరి ప్రత్యేకతలు
28-35 సంవత్సరాల తర్వాత ఆదాయంలో వృద్ధి
క్రమశిక్షణతో కష్టపడితే గొప్ప విజయం సాధిస్తారు.
దీర్ఘకాలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.
మనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్పిన ఈ వివరాలు కామన్ గా చెప్పినవి.. మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి...





















