Vastu Shastra: వాస్తు చిట్కాలతో అదృష్టం మీ గుమ్మంలోనే! ధనం, శాంతి కోసం ఈ శుభ చిహ్నాలను ఇంట్లో సరైన దిశలోనే ఉంచారా?
Vastu Tips In Telugu: ఇంట్లో శాంతి , అభివృద్ధిని తెచ్చే ఈ మతపరమైన చిహ్నాలను వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలోనే ఉంచారా? ఓ సారి గమనించండి... సరైన స్థలంలో లేకుంటే మార్చండి..

Vastu Tips : వాస్తుకి సంబంధించిన శుభ చిహ్నాలు మీ అదృష్టాన్ని మార్చగలవు, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదని, కుటుంబంలో శాంతి ఉండాలని , అభివృద్ధికి మార్గాలు తెరవాలని కోరుకుంటారు. కర్మ, కష్టం, క్రమశిక్షణతో పాటు, ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం కూడా చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని పవిత్ర చిహ్నాలను ఇంట్లో సరైన దిశలో ఉంచడం ద్వారా సుఖం, శాంతి , శ్రేయస్సు వాటంతట అవే ఆకర్షితమవుతాయ్.
జ్యోతిష్య శాస్త్ర పండితులు డాక్టర్ అనీష్ వ్యాస్ ఇలా అన్నారు, “కొన్ని ప్రభావవంతమైన చిహ్నాలన ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి, శ్రేయస్సు పెరుగుతుంది. ఈ చిహ్నాలు సానుకూల శక్తిని సక్రియం చేస్తాయి ...ప్రతికూలతను నిరోధిస్తాయి.”
ప్రధాన ద్వారం - సానుకూల శక్తి ప్రవేశ ద్వారం
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రధాన ద్వారం ఇంట్లోకి ప్రవేశించే శక్తికి కేంద్రం
ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉన్న ప్రధాన ద్వారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు
దక్షిణ దిశలో ద్వారం అశుభం అని చెబుతారు..ఇది ప్రతికూల శక్తిని ప్రవేశింపజేస్తుంది
తలుపు, దాని చుట్టూ శుభ్రపరచడం అవసరం, ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది
ప్రధాన ద్వారం వద్ద పంచసూలక్, స్వస్తిక్ లేదా నమస్తే గుర్తును ఉంచడం వల్ల శుభం .. సామరస్యం పెరుగుతుంది
ఇంటికి ఏ దిశలో ఏం ఉంచాలి - ఏం ఉంచకూడదు?
ఉత్తర దిశ
ధనం , అవకాశాలకు కేంద్రం..ఇక్కడ మనీ ప్లాంట్‌ను ఆకుపచ్చ కుండీలో ఉంచడం శుభప్రదం. చీపురు, వాషింగ్ మెషిన్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు డస్ట్‌బిన్‌లను ఉంచవద్దు
ఈశాన్య మూల (ఉత్తరం-తూర్పు)
అత్యంత పవిత్రమైన దిశ ఇది. ఇక్కడ పూజా స్థలం ఏర్పాటు చేయండి. గంగాజలం ఉంచండి. భారీ వస్తువులను నిల్వ చేయవద్దు
నైరుతి దిశ
స్థిరత్వం ధన సంపాదన దిశ ఇది. ఈ దిశలో మట్టి కుండీని ఉంచడం చాలా శుభప్రదం
పశ్చిమ దిశ
ధన పరిరక్షణకు చిహ్నం. ఇక్కడ లక్ష్మీ-నారాయణుల ఫోటోను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు
గుర్తుంచుకోండి
ఇంటిలోపల లేదా బయట అత్తి, రావి, రేగు, మర్రి, అరటి , దానిమ్మ చెట్లను నాటడం వల్ల వాస్తు ప్రకారం మంచిది కాదు
ఇంట్లో ఉంచవలసిన శుభ చిహ్నాలు - ప్రయోజనాలు
ఓం
ప్రయోజనం: మానసిక శాంతి, సానుకూల శక్తిని సృష్టిస్తుంది
ఉంచవలసిన స్థలం: పూజా స్థలం
పంచసూలక్
ప్రయోజనం: ప్రతికూల శక్తిని ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది
ఉంచవలసిన స్థలం: ప్రధాన ద్వారం
స్వస్తిక్
ప్రయోజనం: శుభం, విజయం, ధన వృద్ధికి సంకేతాలను ఇస్తుంది
ఉంచవలసిన స్థలం: ఈశాన్యం.. దిశ ప్రకారం సరైన రంగులో తయారు చేయండి
కమలం
ప్రయోజనం: జ్ఞానం, సంపద , అదృష్టానికి చిహ్నం
ఉంచవలసిన స్థలం: దేవుడి మందిరం లేదా డ్రాయింగ్ రూమ్
త్రిశూలం
ప్రయోజనం: భయం, అడ్డంకులు , బాధల నుంచి రక్షిస్తుంది
ఉంచవలసిన స్థలం: ప్రవేశ ప్రాంతం
కలశం
ప్రయోజనం: సుఖం, శ్రేయస్సు , శుభాలను పెంచుతుంది
ఉంచవలసిన స్థలం: పూజా స్థలం
నమస్తే గుర్తు
ప్రయోజనం: స్వాగత భావం , సామరస్యం సందేశాన్ని ఇస్తుంది
ఉంచవలసిన స్థలం: ప్రధాన ద్వారం రెండు వైపులా
శంఖం
ప్రయోజనం: పవిత్రత, అదృష్టం మరియు ధన ఆకర్షణ
ఉంచవలసిన స్థలం: దేవుడి మందిరం
దీపం
ప్రయోజనం: సంపద, కాంతి శక్తికి చిహ్నం
ఉంచవలసిన సమయం/స్థలం: పూజ చేసేటప్పుడు వెలిగించాలి
చేప చిహ్నం
ప్రయోజనం: ఆర్థికాభివృద్ధి, మంచి ఆరోగ్యం , విజయానికి అవకాశాలు
ఉంచవలసిన స్థలం: ఉత్తరం-తూర్పు లేదా తూర్పు దిశ
ఆర్థిక స్థిరత్వం కోసం ప్రత్యేక చర్యలు
లాకర్‌ను పశ్చిమ దిశలో ఉంచండి
ఎరుపు రంగు వస్త్రంలో ఆవాలు కట్టి లాకర్లో ఉంచితే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది
దేవుడి మందిరం ఈశాన్య మూలలో గంగాజలం సీసాను ఉంచండి
వాస్తు శాస్త్రాన్ని పాటించడం తప్పనిసరి కాదు కానీ సంవత్సరాలుగా పరీక్షించిన సూత్రాలను ఇంట్లో పాటిస్తే... జీవితంలో శాంతి, సమతుల్యత, స్థిరత్వం పెరుగుతుంది.
“వాస్తు ఉద్దేశ్యం కేవలం... అందం లేదా అలంకరణ మాత్రమే కాదు, శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడం ద్వారా జీవితాన్ని మెరుగుపరచడం.”
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం.






















