Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా భాద్యతలు తీసుకున్న తర్వాత.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పులను చూస్తున్నం. ఈ మార్పుల కారణంగానే ఇండియా వరుసగా ఓటమి పాలవుతుందని గంభీర్ పై పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, ఫ్యాన్స్... ఇలా అందరు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంపై గంభీర్ తాజాగా స్పందించారు. స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదని గౌతమ్ గంభీర్ అన్నాడు. వైట్ బాల్ క్రికెట్ లో ఓపెనింగ్ కాంబినేషన్ మినహాయిస్తే.. మిగితా బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఓవర్ రేటెడ్ అని నేను నమ్ముతాను. అయితే, టెస్టులకు మాత్రమే స్థిరంగా ఒకే బ్యాటింగ్ లైనప్ ఉండాలి అంటూ గంభీర్ వ్యాఖ్యానించారు.
గంభీర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి. గంభీర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్సమన్లు తమ నెంబర్ ఏదైనా ఆడేలాగా ఉండాలి. అంటే గంభీర్ ఈ మాటలని టీమ్ లోని సీనియర్ ప్లేయర్స్ ను ఉద్దేశించి చేసినవే అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇదే విషయంపై గంభీర్.. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ను ఉదాహరణగా చెప్పాడు. "అందుకే వాషింగ్టన్ సుందర్‌కు గత 7-8 నెలలుగా జట్టులో అవకాశం ఇవ్వడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదో స్థానంలో అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించగలడు. బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండటం ఎప్పుడూ మంచిదే. ఇప్పుడు మాకు 7-8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వారి సంఖ్య పెరుగుతూ ఉంటే భారత క్రికెట్‌కు తిరుగుండదు 'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.





















