Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
టీమ్ ఇండియా విమెన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన ఒక్క రోజు వ్యవధిలోనే స్మృతి మంధాన మళ్ళి తన ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ మంధాన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఇప్పుడు ఈ ఫొటో బాగా వైరల్ అవుతుంది.
ఈ నెల శ్రీలంకతో టీమిండియా విమెన్ టీమ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను ఆడనుంది. ఈ నేపథ్యంలోనే స్మృతి మంధాన మళ్ళి బ్యాట్ పట్టింది. నెట్స్ లో స్మృతి మంధాన ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘స్మృతి మంధాన ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.
భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో స్మృతి మంధాన కీలకపాత్ర పోషించింది. ఇక స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. కానీ పెళ్ళికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. అది జరిగిన కొన్ని రోజులకే తమ వివాహం రద్దు అయినట్లు స్మృతి సోషల్ మీడియాలో పేర్కొంది.





















