Health Tips : తప్పులు చిన్నవే ఆరోగ్య సమస్యలు మాత్రం పెద్దవి.. బ్రేక్‌ఫాస్ట్‌తో మధుమేహం, డిన్నర్‌తో బరువు, జాగ్రత్త
Unhealthy Habits : రోజూ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తాయట. ఆ తప్పులు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూసేద్దాం.

Health Mistakes to Avoid : తెలియకుండా రెగ్యులర్‌గా చేసే కొన్ని పనుల వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం నుంచి.. నీళ్లు తాగడం, చెవి క్లీనింగ్, డిన్నర్ విషయాల్లో చేసే తప్పులవల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. అసలు చేయకూడని మిస్టేక్‌లు ఏంటి? వాటిని చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి? ఎలా వాటిని అధిగమించాలో ఇప్పుడు చూసేద్దాం.
బ్రేక్ ఫాస్ట్
బ్రేక్‌ఫాస్ట్‌ని రెగ్యులర్‌గా మిస్ చేస్తున్నారా? అయితే దానివల్ల మెటబాలీజం తగ్గుతుంది. బ్రెయిన్ ఫంక్షన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏమి తినకపోవడం కంటే కనీసం అరటిపండు తిన్నా మంచిదేనని చెప్తున్నారు నిపుణులు.
ప్లాస్టిక్ బాటిల్..
ఎండలో ఉన్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగేస్తూ ఉంటారు. అది మంచిది కాదట. యూవీ కిరణాలు ప్లాస్టిక్ బాటిల్‌పై పడి.. ప్రమాదకరమైన కెమికల్స్ వాటర్లోకి చేరుకునే ప్రమాదముంటుంది. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ ఎండలో ఎక్స్పోజ్ అవుతుంటే వాటిని తాగకపోవడమే మంచిది. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కాపర్ బాటిల్ లేదా స్టీల్ బాటిల్లో నీటిని తీసుకుని వెళ్లొచ్చు.
ఛాతిలో నొప్పి
ఛాతీలో నొప్పి లేదా ఊపిరిలో తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? అయితే మీరు వాటిని అస్సలు ఇగ్నోర్ చేయవద్దు. అవి గుండె సమస్యలకు సంకేతాలు కావొచ్చు. వీలైనంత త్వరగా వైద్యసహాయం తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
ఇయర్ క్లీనింగ్ బడ్స్..
ఇయర్ వాక్స్‌ని క్లీన్ చేయడానికి చాలామంది ఇయర్ బడ్స్ ఉపయోగిస్తారు. పైగా ఇవి సేఫ్ అనుకుంటారు. కానీ ఇవి అస్సలు మంచివి కావట. వీటిని ఉపయోగించడం వల్ల ఇయర్ వాక్స్ ఇంకా లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ని పెంచుతుందట. కొన్ని సందర్భాల్లో వినికిడి సమస్యలను పెంచుతుందట. ఇయర్ వాక్స్‌ని క్లీన్ చేసుకోవడానికి ఇయర్ డ్రాప్స్ ఉపయోగించడం లేదా వైద్యుల్ని సంప్రదించడం చేయాలి.
డబ్బులు పట్టుకున్న తర్వాత..
డబ్బులు ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదా శానిటైజ్ చేసుకోవాలని చెప్తున్నారు. డబ్బులు బ్యాక్టిరీయాను ఒకరినుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తాయి కాబట్టి.. వాటిని పట్టుకున్న తర్వాత కచ్చితంగా చేతులు కడుక్కోవాలి.
డిన్నర్ తర్వాత..
చాలామంది ఇలా తిన్న వెంటనే అలా పడుకుంటారు. రాత్రి నిద్ర సమయంలో ఇలాంది చేయకూడదు. లేదంటే బరువు పెరుగుతారు. గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు పెరుగుతాయి. మీకు రెండు గంటలు ముందుగా తినే అలవాటు లేకుంటే.. తిన్న తర్వాత కనీసం పది నిమిషాలు వాక్ చేయండి.
ఫోన్ ఛార్జింగ్..
బెడ్‌కి దగ్గరగా ఉండాలని ఫోన్‌ని పట్టుకుని బెడ్ మీద ఉంచి ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం కొన్ని సందర్భాల్లో మంటలు రావడం జరగొచ్చు. ఈఎంఎఫ్ ఎక్స్పోజర్ కారణంగా నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.
ఆ నూనె వద్దు..
కుకింగ్ ఆయిల్‌ని రీ యూజింగ్ చేవద్దు. వాటిలో టాక్సిన్లు ఉంటాయని.. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయని చెప్తున్నారు. ఆయిల్‌ని డీప్ ఫ్రైకి ఉపయోగిస్తే.. అది మళ్లీ ఉపయోగించకూడదని చెప్తున్నారు.
ఈ మిస్టేక్స్ చిన్నవే అయినా ఏమి పర్లేదులే అని వాటిని రెగ్యులర్‌గా చేస్తారు. వీటివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి హెల్తీగా ఉండేందుకు ముందుగా ఈ సింపుల్ మిస్టేక్స్‌ని దూరం చేసుకోండి. లాంగ్‌టర్మ్ హెల్త్ గోల్స్‌లో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















