మీకు మ్యూజిక్ వినే అలవాటు ఎక్కువగా ఉందా? హెడ్​ ఫోన్స్ ఎక్కువగా వాడుతారా? అయితే ఇది మీకోసమే.

హెడ్​ ఫోన్స్ ఎంతసేపు వాడితే మంచిది? ఎంతసేపు ఉంచితే ఎలాంటి ఇబ్బందులు ఉండవో ఇప్పుడు చూసేద్దాం.

హెడ్​ ఫోన్స్ ఎప్పుడూ ఉపయోగించినా.. 60 శాతం వాల్యూమ్​లోనే ఉంచుకోవాలి.

గంటకు మించి ఎక్కువగా పెట్టుకోకూడదు. 60 నిమిషాల తర్వాత పావుగంట బ్రేక్ తీసుకోవచ్చు.

ఎక్కువసేపు ఎక్కువ సౌండ్​తో మ్యూజిక్ పెట్టుకుని వింటే ఇది కొన్ని సమస్యలకు లీడ్ చేస్తుంది.

ఎక్కువసేపు, సౌండ్ ఎక్కువ పెట్టుకుని ఉండడం వల్ల చెవిటి సమస్య వచ్చే ప్రమాదముంది.

ఇయర్ బడ్స్ లేదా హెడ్​ ఫోన్స్ ఎక్కువసేపు పెట్టుకుంటే చెవి నొప్పి లేదా ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.

ఎక్కువసమయం హెడ్​ ఫోన్స్ ఉపయోగించడం వల్ల ఒత్తిడి పెరిగి ఫటిగో వంటి సమస్యలు రావొచ్చు.

ఇయర్​ బడ్స్​కి బదులుగా హెడ్ ఫోన్స్ వాడితే కాస్త బెటర్​గా ఉంటుంది. కానీ సౌండ్ 60 శాతమే ఉండేలా చూసుకోండి.

పడుకునేప్పుడు హెడ్​ఫోన్స్ పెట్టి పడుకోకూడదు. ఇది చెవి ఆరోగ్యానికి మంచిది కాదు.

నాయిస్ క్యాన్సలింగ్ హెడ్​ఫోన్స్ ఉపయోగిస్తే బెటర్ ఎక్స్​పీరియన్స్ ఉంటుంది.