Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు(Jubilee By Election Result 2025) సర్వేలకు సైతం అందలేదు. చాలా సర్వేలు బీఆర్ఎస్ దే విజయం అని తేల్చి చెప్పినా..క్షేత్రస్థాయి వేరే ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) ఏకంగా 24వేల కు పైగా ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)పై సంచలన విజయం సాధించారు. సానుభూతి పనిచేయలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఉపఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీత పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బరిలో నిలబడిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలుపొందారు. మొదటి నుంచి నవీన్ ను వీధి రౌడీ, ఆకు రౌడీ అంటూ బీఆర్ఎస్ అటు ఆంధ్రా సెటిలర్లు, ఇటు మైనార్టీల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేసినా ఆ పాచికలు పారలేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదలు మంత్రి వర్గమంతా జూబ్లీహిల్స్ బైఎలక్షన్ ను సీరియస్ గా తీసుకుని ప్రచారం నిర్వహించటంతో నవీన్ యాదవ్ 24, 658 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై సంచలన విజయం సాధించారు. అసలు నవీన్ గెలుపునకు ప్రధాన కారణాలేంటీ ఈ వీడియోలో చూసేద్దాం.





















