Akhanda 2 First Song: 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
Akhanda 2 Thaandavam First Song Review: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 'అఖండ 2' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'తాండవం' లిరికల్ వీడియో వచ్చేసింది.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా మాస్ కమర్షియల్ హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thaandavam Movie). దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణ - బోయపాటి శ్రీను చేసిన 'అఖండ'కు సైతం ఆయన సంగీతం అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అందుకని, 'అఖండ 2' సంగీతంపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు విడుదలైన 'అఖండ 2' తొలి పాట చూస్తే అంచనాలను మించి ఉందని చెప్పాలి.
పూనకాలు తెప్పించేలా అఖండ 2 పాట!
'అఖండ 2' సినిమాలోని తొలి పాట 'తాండవం'ను ఇవాళ ముంబైలో విడుదల చేశారు. దిగ్గజ గాయకులు శంకర్ మహదేవన్, ఖైలాష్ ఖేర్ సహా దీపక్ బ్లూ ఈ పాట పాడారు. కళ్యాణ్ చక్రవర్తి రాశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట కేవలం బాలయ్య అభిమానులు, ప్రేక్షకులను మాత్రమే కాదు... శివ భక్తులకు సైతం పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాలో మొదటి పాట బావుందని పేరు వచ్చింది.
'తాండవం' లిరికల్ వీడియో చూస్తే... అందులో మేకింగ్ వీడియో షాట్స్ సైతం కొన్ని ఉన్నాయి. అవన్నీ పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా రామ్ - లక్ష్మణ్ మాస్టర్లు కొన్నిఫైట్స్ కంపోజ్ చేసినట్టు అర్థం అవుతోంది.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
డిసెంబర్ 5న భారీ ఎత్తున సినిమా విడుదల!
Akhanda 2 Release Date: 'సింహ', 'లెజెండ్', 'అఖండ'... హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో 'అఖండ 2'తో డబుల్ హ్యాట్రిక్ మొదలు అయ్యింది. 'అఖండ' విజయంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి మతుకుమిల్లి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న చిత్రమిది. సంయుక్త హీరోయిన్. డిసెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...





















