Pawan Kalyan: కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...
'కార్తీక దీపం', 'కార్తీక దీపం ఇది నవ వసంతం' సీరియల్స్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్రకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. కారణం ఏమిటంటే?

'కార్తీక దీపం' సీరియల్ బుల్లితెరపై ఓ ట్రెండ్‌సెట్టర్. తెలుగు టీవీ సీరియల్స్ హిస్టరీలోనే హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకొని రికార్డును క్రియేట్ చేసింది. సుమారు నాలుగైదేళ్ల పాటు రేటింగ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. 'కార్తీక దీపం'తోనే వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
'కార్తీక దీపం' సీక్వెల్ కూడా హిట్టే!
ప్రేమ కథకు రివేంజ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి 'కార్తీక దీపం' సీరియల్‌ను తెరకెక్కించారు డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర (Kapuganti Rajendra). సినిమాలకు ధీటుగా ఎమోషన్స్‌ను పండించి ఈ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. డైరెక్టర్‌గా సినిమాలతో కాపుగంటి రాజేంద్ర కెరీర్ మొదలైంది. కానీ వాటి కంటే సీరియల్ ద్వారానే ఎక్కువగా ఆయన ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం 'కార్తీక దీపం' సీక్వెల్‌కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు రాజేంద్ర. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీక్వెల్ టాప్ సీరియల్‌గా కొనసాగుతోంది.
దర్శకుడిగా 'డబ్బు భలే జబ్బు'...
'కార్తీక దీపం' కంటే ముందు డైరెక్టర్‌గా రెండు సినిమాలు చేశాడు కాపుగంటి రాజేంద్ర. అల్లు రామలింగయ్య, రావు గోపాల రావు ప్రధాన పాత్రల్లో నటించిన 'డబ్బు భలే జబ్బు' మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు నంది అవార్డును గెలుచుకుంది. 'డబ్బు భలే జబ్బు' తర్వాత తమ బ్యానర్‌లోనే కాపుగంటి రాజేంద్రకు మరో ఛాన్స్ ఇచ్చారు అల్లు అరవింద్.
పవన్ హీరోగా రాజేంద్ర దర్శకత్వంలో...
పవన్ కళ్యాణ్ హీరోగా కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో సాక్షి శివానంద్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో కథను సిద్ధం చేసుకున్నారు రాజేంద్ర. ధనవంతుల కుటుంబంలోకి ఫేక్ అల్లుడిగా వెళ్లి ఓ కుటుంబాన్ని చక్కదిద్దే యువకుడి కథతో ఈ సినిమా చేయాలని అనుకున్నారట. పవన్ కళ్యాణ్‌కు కథ నచ్చడంతో షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. ఓ భారీ సెట్ కూడా వేశారట.
Also Read: ఫ్యాన్స్‌కు రాజమౌళి రిక్వెస్ట్... అవి పుకార్లే, నమ్మకండి - SSMB29 ఈవెంట్ ఎంట్రీపై క్లారిటీ వీడియో
కాపుగంటి రాజేంద్ర అనుకున్న కథకు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'బావ గారు బాగున్నారా'తో పాటు నాగార్జున 'చంద్రలేఖ'కు దగ్గరి పోలికలు ఉండటంతో పవన్ కళ్యాణ్‌తో చేయాల్సిన సినిమాను అల్లు అరవింద్ పక్కనపెట్టారు. అలా పవర్ స్టార్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను కాపుగంటి రాజేంద్ర మిస్ అయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన 'శివ్ శంకర్' సినిమాకు రాజేంద్ర దర్శకత్వం వహించాడు.ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Also Read: ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?





















