Globetrotter Main Cast: ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?
SSMB29 Cast In Emojis: రాజమౌళి రోజుకు ఒక అప్డేట్ ఇస్తూ మహేష్ బాబు హీరోగా తాను తీస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పుడీ సినిమాలో క్యారెక్టర్లను ఎమోజీల్లో చెప్పింది ప్రియాంక.

Globetrotter characters explained in emojis: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఓ అలవాటు ఉంది. థియేటర్లలోకి సినిమా రావడానికి ముందు తన సినిమా కథ ఏమిటో రివీల్ చేస్తారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తాను తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా కథను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. బహుశా శనివారం (నవంబర్ 25న) జరగబోయే ఈవెంట్‌లో ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. ఈలోపు రోజుకు ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నారు. కథ చెప్పలేదు గానీ 'గ్లోబ్ ట్రాటర్' క్యారెక్టర్లను ఎమోజీల్లో చెప్పారు ప్రియాంక చోప్రా.
ఎమోజీల్లో ప్రియాంక చెప్పిన క్యారెక్టర్లు...
మహేష్ బాబు సింహమే, మరి మిగతా వాళ్ళు!?
🦁 💃💪🏽🥷🏼 @Rudraveena_ https://t.co/5LpsskSIZ1
— PRIYANKA (@priyankachopra) November 12, 2025
చూశారుగా ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్! అందులో నాలుగు ఎమోజీలు ఉన్నాయి. మొదటి ఎమోజీ... 🦁 . మీకు గనుక గుర్తు ఉంటే... మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సింహాన్ని సింబాలిక్ గా చూపిస్తూ వస్తున్నారు రాజమౌళి. పాస్ పోర్ట్ సీజ్ చేసిన పోస్టులోనూ వెనుక సింహం ఉంటుంది. అంటే... ఆ రోల్ మహేష్ బాబు అన్నమాట. ఇక రెండో ఎమోజీ చూస్తే... 💃.
'గ్లోబ్ ట్రాటర్' నుంచి ఆల్రెడీ ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశారు. మందాకినీ పాత్రలో ఆమె నటిస్తున్నట్టు తెలిపారు. సో... 💃. ఈ ఎమోజీ తన పాత్ర గురించి ప్రియాంక పోస్ట్ చేసి ఉండొచ్చు. ఆ ఎమోజీని సెలబ్రేషన్ సూచికగా చూడొచ్చు. ఫిమేల్ క్యారెక్టర్ సెలబ్రేషన్ కింద చూడొచ్చు. మరి మిగతా క్యారెక్టర్లు?
పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఏది? ఆ నింజా ఎవరు?
ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన ఎమోజీల్లో మూడో ఎమోజీ 💪🏽. బలానికి సూచిక ఇది. ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్లలో పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఒకటి ఉంది. ఆయన్ను వికలాగుండిగా, అదే సమయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ బలశాలి పృథ్వీరాజా? లేదంటే మరొకరా? అనేది చూడాలి. ఇంకొక ఎమోజీ 🥷🏼 . యుద్ధ విద్యల్లో ఆరితేరిన ఆ నింజా ఎవరో చూడాలి.
Also Read: కావ్య మారన్‌తో అనిరుధ్ సీక్రెట్ ట్రిప్... ఇలా దొరికేశారేంటి?
దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆ రోజు మహేష్ బాబు ఫస్ట్ లుక్, అలాగే టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉంది. అప్పుడు కథ గురించి జక్కన్న ఏమైనా చెబుతారేమో చూడాలి.
Also Read: కెన్యా అడవుల్లో అనసూయ... మహేష్ - రాజమౌళి సినిమా షూట్ చేసిన ప్లేసుకు!?





















