అన్వేషించండి

Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

Oscars Most Shocking Moments: ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎదురు చూసే పురస్కార వేడుక... ఆస్కార్స్. నటీమణుల గ్లామర్ నుంచి విన్నింగ్ మూమెంట్స్ కోసం చూసే అకాడమీ అవార్డుల్లో టాప్ 10 షాకింగ్ మూమెంట్స్...

ఆస్కార్స్... ప్రపంచ సినీ ప్రేమికులు అందరూ ఎదురు చూసే పురస్కారాల వేడుక. నటీమణుల గ్లామర్ నుంచి విన్నింగ్ మూమెంట్స్ వరకు... ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు మెమరబుల్ అని చెప్పాలి. అయితే... ఆస్కార్ స్టేజిపై నిర్వాహకులతో పాటు ఆ వేడుకకు వచ్చిన ప్రముఖులు, ప్రేక్షకులు - ఎవరూ ఊహించని ఘటనలు కొన్ని జరిగాయి. అందరికీ షాక్ ఇచ్చాయి. అటువంటి షాకింగ్ మూమెంట్స్‌లో టాప్ 10 చూస్తే?

రూల్స్ లెక్క చేయలేదు
ఆస్కార్స్ వేదికపై పురస్కార గ్రహీత ఎంతసేపు మాట్లాడనేది ముందుగా చెబుతారు. ఆ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సాధారణంగా 45 సెకన్లకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ, గతేడాది (2025) ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అడ్రియన్ బ్రాడీ ఏకంగా 7 నిమిషాల పాటు మాట్లాడారు. మధ్యలో నిర్వాహకులు ప్రసంగాన్ని ఆపమని కోరినా వినలేదు. మ్యూజిక్ ప్లే చేసినా లెక్క చేయకుండా యుద్ధం, అణిచివేత వంటి అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.

హీరోయిన్ డ్రస్ చిరిగింది
ఆస్కార్స్ 2024లో ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. అయితే అవార్డు అందుకోవడానికి వెళ్లే ముందు ఆమె ధరించిన లూయిస్ విట్టన్ డ్రస్ వెనుక కాస్త చిరిగింది. 'ఐ యామ్ కెన్' పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ పొరపాటు జరిగిందని ఎమ్మా స్టోన్ పేర్కొంది.

క్రిస్‌పై స్మిత్ చెంపదెబ్బ
ఆస్కార్స్ 2022లో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వేదికపై హోస్ట్ క్రిస్ రాక్ మీద విల్ స్మిత్ చెయ్యి చేసుకోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా లైవ్‌లో చూశారు. తన భార్య జడ పింకెట్ స్మిత్‌ మీద క్రిస్ రాక్ వేసిన జోక్‌ విల్ స్మిత్‌కు ఆగ్రహం తెప్పించింది. దాంతో అందరూ చూస్తుండగా స్టేజి మీదకు వెళ్లి క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టారు విల్ స్మిత్. దాంతో ఆయనపై పదేళ్ల నిషేధం విధించారు ఆస్కార్ నిర్వాహకులు.

కెమిస్ట్రీ దెబ్బకు బ్రేకప్‌
పాపులర్ సింగర్ లేడీ గాగా 2019లోని ఆస్కార్ వేడుకలో పాల్గొన్నారు. బ్రాడ్లీ కూపర్ (Bradley Cooper)తో కలిసి 'ఏ స్టార్ ఈజ్ బోర్న్' సినిమాలోని 'షాలో' పాటకు స్టేజిపై డ్యాన్స్ చేశారు. వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ప్రేమలో ఉన్నారేమోనని ఆశ్చర్యపోయారంతా. ఆస్కార్స్ జరిగిన కొన్ని నెలలకు... అప్పటికి నాలుగేళ్ల నుంచి బ్రాడ్లీతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సూపర్ మోడల్ ఇరినా షయక్ విడిపోయారు. బ్రాడ్లీ, ఇరినాకు మూడేళ్ళ కుమార్తె ఉంది. ఆ చిన్నారి కస్టడీని ఇద్దరూ తీసుకున్నారు. తమ మధ్య ఏమీ లేదని బ్రాడ్లీ, లేడీ గాగా చెప్పినా... ఇరినాతో బ్రేకప్ వెనుక ఆస్కార్ స్టేజిపై పెర్ఫార్మన్స్ కారణమని హాలీవుడ్ గుసగుస.

Also Read: Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

హిస్టరీలో బిగ్గెస్ట్ బ్లండర్!
ఆస్కార్ హిస్టరీలో, ఆ మాటకు వస్తే హాలీవుడ్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లండర్ అంటే... 89వ అకాడమీ అవార్డులను గుర్తు చేసుకోవాలి. ఆ ఏడాది 'మూన్‌ లైట్' ఉత్తమ చిత్రంగా నిలవగా... పొరపాటున 'లా లా ల్యాండ్'ను విజేతగా ప్రకటించారు. ఆ చిత్ర బృందం వేదికపైకి వచ్చిన స్పీచ్‌లు ఇస్తుండగా... పొరపాటును గుర్తించి సరిదిద్దారు. తర్వాత 'మూన్ లైట్' బృందం వచ్చి పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ చిత్ర పురస్కారం చేతి వరకు వచ్చి వెనక్కి వెళ్లినా... 'లా లా ల్యాండ్' నటి ఎమ్మా స్టోన్, దర్శకుడు డామియన్ ఛాజెల్లె అవార్డులు అందుకున్నారు.

నిద్రపోయినట్టు నటన!
ఆస్కార్ 2020లో 'జోజో రాబిట్'కు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్న న్యూజీలాండ్ ఫిల్మ్ మేకర్ టేకా వైటీటీ గుర్తు ఉన్నారా? దానికి పదిహేనేళ్ల క్రితం 2005లో 'బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్' కేటగిరీలో నామినేట్ అయ్యారు. స్టేజిపై నామినేషన్స్ లిస్ట్ ప్రకటిస్తున్న సమయంలో నిద్రపోయినట్టు నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.  

Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

నడకలో, ప్రకటనలో...
తడబడిన ఆ ఇద్దరూ!
ఆస్కార్స్ 2013లో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడానికి మెట్లు ఎక్కుతుండగా నటి జెన్నిఫర్ లారెన్స్ తడబడి పడిపోయారు. ఆ మరుసటి ఏడాది (2014లో) నటి ఇడినా మెన్‌జెల్ (Idina Menzel) పేరును జాన్ ట్రావోల్టా పొరపాటున 'అడెల్ డాజీమ్' అని పలిచారు. ప్రకటనలో తడబడ్డారు.

ఆ దుస్తులు ఏంటమ్మా!
ఎంజెలీనా జోలీ 2012లో జరిగిన ఆస్కార్ వేడుకలో ధరించిన డ్రస్ వైరలైంది. తన డ్రస్ నుంచి కాలు బయటకు పెట్టి ఆవిడ ఇచ్చిన పోజ్ వైరల్ కాగా... దానికి 12 ఏళ్ళ ముందు 2000లో తన సోదరుడికి రెడ్ కార్పెట్‌పై ముద్దు పెట్టి వార్తల్లో నిలిచారు. వివాదాలకు కారణం అయ్యారు. ఆస్కార్స్ 2001లో గాయని బియాక్ (Bjork) హంస ఆకారంలో ఉన్న డ్రస్ ధరించి రెడ్ కార్పెట్‌పై గుడ్లు పెట్టినట్టు నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

స్టేజిపై నగ్న ప్రదర్శన!
సుమారు 50 ఏళ్ళ క్రితం... ఆస్కార్స్ 1974లో రాబర్ట్ ఓపెల్ అనే వ్యక్తి వేదికపై నగ్నంగా పరిగెత్తి కలకలం సృష్టించారు. అప్పట్లో అది సంచలనమైంది. దానికి ముందు ఏడాది... 1973లో మార్లన్ బ్రాండో తన అవార్డును తిరస్కరిస్తూ స్థానిక అమెరికన్ కార్యకర్త సచిన్ లిటిల్ ఫెదర్‌ను పంపారు.

Also ReadShiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
NTR On Pawan Kalyan: పవన్ కోలుకుంటున్నారు - భార్య అన్నా పోస్ట్... త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ సహా ప్రముఖుల ఆకాంక్ష
పవన్ కోలుకుంటున్నారు - భార్య అన్నా పోస్ట్... త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ సహా ప్రముఖుల ఆకాంక్ష
PM Modi on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు సహా ప్రముఖుల ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు సహా ప్రముఖుల ఆకాంక్ష
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Love Failure: అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
Embed widget