Chinmayi Sripada: మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
Chinmayi Sripada vs Vairamuthu: వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. చిన్మయి వర్సెస్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అన్నట్టుంది.

తమిళ గేయ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించిన తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ లోక నాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్టులు చేశారు. తనతో పాటు మరొక 16 మంది మహిళలు తమను వైరముత్తు లైంగికంగా వేధించారని తెలిపారని, అటువంటి వ్యక్తికి ఎలా మద్దతు పలుకుతారని గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ప్రశ్నించారు.
సినిమాల్లో శక్తివంతమైన వ్యక్తులు (కమల్ హాసన్‌ను ఉద్దేశిస్తూ) రాజకీయాల్లోకి వెళ్లేసరికి మహిళలు చెప్పేవి పెడచెవిన పెడతారని, మగవాళ్ళు ఎప్పటికీ మన (మహిళల) వైపు నిలబడరని చిన్మయి పేర్కొన్నారు. మగవాళ్లు ఎప్పటికీ మగవాళ్లకు మద్దతుగా నిలబడతారనేది మహిళలందరూ గుర్తు ఉంచుకోవాలని ఆమె చెప్పారు. చిన్మయి శ్రీపాద వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేశారు.
సంగీత - విజయ్ విడాకుల్లో త్రిషకు మద్దతు...
అప్పుడు మీ కులం వైపు నిలబడ్డావా? ఎందుకలా?
వైరముత్తుకు వ్యతిరేకంగా కొన్నాళ్ల నుంచి చిన్మయి శ్రీపాద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఆయనకు జ్ఞానపీఠ్ వచ్చిన తరుణంలో శుభాకాంక్షలు చెప్పిన రజనీకాంత్, కమల్ హాసన్ మీద సైతం పోస్టులు చేశారు. అందుకు గాను అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదంలో దళపతి విజయ్ - సంగీత విడాకుల వ్యవహారాన్ని, త్రిష పేరు ముడి పెడుతూ వచ్చిన కథనాలను తీసుకు వచ్చారు కొందరు.
How many of you are in the PR machinery to stand with a molester or really do you have zero gray matter between your ears in your skull to not understand what Sexual harassment is and POWERFUL MEN IN POLITICS PUBLICLY PRAISING A MAN NAMED BY 17 WOMEN?
— Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2026
Stop doing drama about… https://t.co/yrGEpsXyPM
విజయ్ విడాకుల వ్యవహారంలో కథానాయిక త్రిషకు చిన్మయి శ్రీపాద మద్దతుగా నిలిచారని 'ఎక్స్'లో పలువురు పోస్టులు చేస్తున్నారు. వైరముత్తు చేసినది తప్పు అయితే త్రిష చేసినది కూడా తప్పేనని... విజయ్ - సంగీత భార్యాభర్తలు అని, మరొకరి భర్తతో త్రిష వివాహేతర సంబంధం నడుపుతున్నారని, అక్కడ సంగీత బాధితురాలు అని, ఆమెకు మద్దతుగా చిన్మయి ఒక్క మాట కూడా మాట్లాడలేదని 'ఎక్స్'లో ఒకరు రాసుకొచ్చారు. కులం ఆధారంగా ఒకరి వైపు నిలబడ్డారా? లేదా త్రిష తన స్నేహితురాలు అని మౌనం వహించారా? అని ప్రశ్నించారు. తమ స్నేహితుడికి రజనీ, కమల్ శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేమిటి? అని అడిగారు. సదరు పోస్టు పట్ల చిన్మయి తీవ్రంగా స్పందించారు.
''లైంగిక వేధింపులు అంటే ఏమిటో అర్థం చేసుకోకుండా ఉండటానికి మీ బుర్రలో ఏమీ లేదా? ఒక లైంగిక వేధింపుదారుడికి మద్దతుగా నిలబడటానికి మీలో ఎంత మంది ఉన్నారు? 17 మంది మహిళలను లైంగికంగా వేధించిన వ్యక్తిని రాజకీయాల్లో శక్తివంతమైన మగవాళ్ళు బహిరంగంగా ప్రశంసిస్తుంటే మీరు మద్దతు ఇస్తున్నారా?'' అని చిన్మయి ప్రశ్నించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి డ్రామా చేయడం ఆపేయాలని, అమెరికాలో ఎప్‌స్టీన్‌ను రక్షిస్తున్న వ్యక్తులకూ, మీకూ మధ్య తేడా ఏమీ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియాలోనూ ఎప్‌స్టీన్ లిస్ట్ ఉండాలని తాను చెప్పేది ఇందుకేనని చిన్మయి పేర్కొన్నారు.
Also Read: Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
విజయ్ (Thalapathy Vijay)తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో త్రిష పోస్ట్ చేస్తే వాటికి చిన్మయి లైక్స్ కొట్టారని, తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య సంగీత చెబితే ఆ అంశంపై చిన్మయి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని మరి కొందరు పేర్కొన్నారు. అయితే భారతీయుల డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉందని, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి మద్దతు ఇవ్వకుండా భారతీయ మగవాళ్ళు ఉంటారని ఆశించలేమని చిన్మయి తెలిపారు.
When this is India - one cannot expect Indian men to stop defending a serial molester.
— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026
Rape culture is in the DNA.
May that which you support return to you. https://t.co/7ykXePwVIh
Also Read: Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
ట్రెండింగ్ వార్తలు






















