అన్వేషించండి

UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి

UGC NET Notification : యూజీసీ నెట్ జూన్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నమోదు ప్రక్రియ ప్రారంభించింది. అభ్యర్థులు ఎలా రిజిస్టర్ అవ్వాలో ఇక్కడ చూడొచ్చు

UGC NET Notification : యువత విద్య, పరిశోధన రంగాల‌్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఒక బంగారు అవకాశం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (UGC)  జాతీయ అర్హత పరీక్ష UGC NET జూన్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరీక్ష జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవుల కోసం నిర్వహిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in లోకి వెళ్లి మే 7, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈసారి UGC NET పరీక్ష జూన్ 21 నుంచి జూన్ 30 వరకు కంప్యూటర్ ఆధారిత మోడ్ (CBT) లో నిర్వహించనున్నారు. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. దరఖాస్తు సమయంలో సరైన సమాచారాన్ని అందించాలని అభ్యర్థులకు NTA సూచించింది, ఎందుకంటే అన్ని వివారలు నమోదు చేసిన మొబైల్ నంబర్, ఇమెయిల్ ద్వారా మాత్రమే పంపిస్తామని తెలిపింది. అందుకే ఆ వివరాలు నమోదు చేసేటప్పుడు పూర్తి జాగ్రత్తవహించాలని హితవుపలికింది.

ముఖ్యమైన తేదీలు

  • అధికారిక ప్రకటన, దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 16, 2025
  • దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: మే 7, 2025 (రాత్రి 11:59 గంటల వరకు)
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 8, 2025
  • వివరాలు సవరించుకునే వెసులుబాటు ఉన్న టైం: మే 9 నుంచి 10, 2025
  • పరీక్ష తేదీ: జూన్ 21 నుంచి 30, 2025

దరఖాస్తు ఫీజు

ఫీజులు చెల్లింపు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఏ సూచించింది. ఒకసారి చెల్లింపు చేస్తే తిరిగి రాదని పేర్కొంది. ఓసీ అభ్యర్థులు ఈ పరీక్ష కోసం 1150 రూపాయల ఫీజు చెల్లించాలి. EWS/OBC (నోన్ క్రీమీ లేయర్) అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. SC/ST/PWD/ థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు  325 రూపాయలు చెల్లించాలి.

వయో పరిమితి

JRFకు గరిష్ట వయస్సు జూన్ 1, 2025 నాటికి 30 సంవత్సరాలు. అంతకు మించిన ఉన్నవాళ్లు అర్హులు కారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD ప్రోగ్రామ్‌ల కోసం రాసేవాళ్లకు ఎలాంటి  వయోపరిమితి లేదని ఎన్టీఏ పేర్కొంది. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని సూచించింది. 

పరీక్ష కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి

  1. ముందుగా NTA అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in లేదా www.nta.ac.in సందర్శించండి.
  2. “UGC NET జూన్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు” లింక్‌పై క్లిక్ చేయండి.
  3. ఒక చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోండి.
  4. మీ వ్యక్తిగత, విద్యా, పరీక్ష సంబంధిత వివరాలను జాగ్రత్తగా పూరించండి.
  5. పాస్‌పోర్ట్ సైజు ఫోటో , సంతకంతో సహా అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
  6. డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించండి.
  7. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ధృవీకరణ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఇది మీకు ఉపయోపడుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget