అన్వేషించండి

JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!

JEE Main 2027 Registration: దేశంలోని టాప్ ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NTA JEE మెయిన్ 2027 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.
  • లేటు ఫీజు లేకుండా నవంబర్ 22, దరఖాస్తు సవరణ నవంబర్ 29.
  • జనవరి 20-28 మధ్య పరీక్షలు, రోజుకు రెండు షిఫ్టులలో నిర్వహణ.

JEE Main 2027 Registration: ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జేఈఈ మెయిన్ 2027 మొదటి సెషన్ (జనవరి సెషన్) కోసం అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలోని టాప్ ఇంజినీరింగ్ ఇన్సిస్ట్యూట్స్ ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడానికి జేఈఈ మెయిన్ స్కోర్ అత్యంత కీలకం.  జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి, ఐఐటీల్లో సీటు పొందాలనుకునే అభ్యర్థులకు జేఈఈ మెయిన్ పేపర్ 1 చాలా కీలకం. జనవరి సెషన్ విద్యార్థులకు మెరుగైన స్కోరు సాధించడానికి ముందస్తుగా అవకాశాన్ని అందిస్తుంది. NTA దరఖాస్తులు, పరీక్షలు, అడ్మిట్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను విడుదలయ్యాయి.  

జేఈఈ మెయిన్ ముఖ్యమైన తేదీలు, షెడ్యూల్  

  1. రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 24 
  2. లేటు ఫీజు లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 22 (రాత్రి 11:50 గంటల వరకు)
  3. లేటు ఫీజుతో దరఖాస్తుల సమర్పణ: నవంబర్ 23 నుండి 26 వరకు
  4. అప్లికేషన్ సవరణ విండో : నవంబర్ 27 నుండి 29 వరకు
  5. ఎగ్జామ్ సిటీ ప్రకటన: డిసెంబర్ 30 
  6. అడ్మిట్ కార్డుల విడుదల: జనవరి 13, 2027 నుంచి  
  7. పరీక్ష తేదీలు: జనవరి 20, 21, 22, 23, 24, 28 

పరీక్షా విధానం,  షిఫ్టులు  

  • జేఈఈ మెయిన్ 2027 జనవరి సెషన్ ఎగ్జామ్‌ను రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. 
  • ఫస్ట్ షిఫ్ట్: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (3 గంటలు)
  • సెకండ్ షిఫ్ట్: మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు (3 గంటలు)
  • B.Arch, B.Planning రెండూ రాసే విద్యార్థులకు పరీక్ష సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.  

కోర్సులు, పేపర్లు  

  • పేపర్ 1: బీఈ / బీటెక్ కోర్సులు 
  • పేపర్ 2A: బి.ఆర్కిటెక్చర్ 
  • పేపర్ 2B: బి.ప్లానింగ్  

Also Read: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

దరఖాస్తు విధానం  

  1. అభ్యర్థులు ముందుగా NTA అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.  
  2. హోమ్‌పేజీలో 'JEE Main 2027 Session 1 Registration' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.  
  4. ఆ తర్వాత లాగిన్ అయి విద్యా వివరాలు, పరీక్షా కేంద్రాలు నమోదు చేయాలి.
  5. విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  6. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
  7. కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. 

    Also Read: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!

Frequently Asked Questions

జేఈఈ మెయిన్ 2027 మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ లేటు ఫీజు లేకుండా చివరి తేదీ ఎప్పుడు?

లేటు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 22, రాత్రి 11:50 గంటల వరకు. లేటు ఫీజుతో నవంబర్ 23 నుండి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2027 జనవరి సెషన్ పరీక్ష తేదీలు ఎప్పుడు?

జేఈఈ మెయిన్ 2027 జనవరి సెషన్ పరీక్షలు జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీలలో జరుగుతాయి. అడ్మిట్ కార్డులు జనవరి 13, 2027 నుండి లభిస్తాయి.

జేఈఈ మెయిన్ 2027 జనవరి సెషన్ పరీక్ష ఎన్ని షిఫ్టులలో జరుగుతుంది మరియు వాటి సమయాలు ఏమిటి?

పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు.

జేఈఈ మెయిన్ 2027లో ఏయే కోర్సులకు ఏ పేపర్లు ఉన్నాయి?

పేపర్ 1 బీఈ/బీటెక్ కోర్సుల కోసం, పేపర్ 2A బి.ఆర్కిటెక్చర్ కోసం, మరియు పేపర్ 2B బి.ప్లానింగ్ కోసం.

జేఈఈ మెయిన్ దరఖాస్తు సవరణ విండో ఎప్పుడు తెరవబడుతుంది?

దరఖాస్తు సవరణ విండో నవంబర్ 27 నుండి నవంబర్ 29 వరకు తెరవబడుతుంది. ఈ సమయంలో అభ్యర్థులు తమ దరఖాస్తులను సరిచేసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Dry Fruits Benefits : బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
Bigg Boss Season 10 Today November 15th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
Embed widget