అన్వేషించండి

NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!

NEET JEE Weightage Changes: దేశవ్యాప్తంగా NEET, JEEలో ఎలాగైనా సీటు సంపాదించాలని విద్యార్థులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని తగ్గించే పనిలో కేంద్రం ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం NEET, JEE పరీక్షల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
  • ప్రవేశ, బోర్డు పరీక్ష మార్కులకు 50% వెయిటేజీ యోచన.
  • విద్యార్థుల ఒత్తిడి తగ్గి, కోచింగ్ దందా తగ్గుతుంది.
  • బహుళ ప్రయత్నాలు, ఆన్-డిమాండ్ పరీక్షలు పరిశీలనలో ఉన్నాయి.

NEET JEE Weightage Changes: విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు ఇంటర్‌మీడియట్. దీని తర్వాత రాసే ప్రతీ పరీక్ష కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతోంది. అన్నింటి కంటే NEET, JEEపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఎక్కడైనా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత విజయం సాధించలేకపోయామని కొందరు విద్యార్థులు విషాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జేఈఈ, నీట్‌ విషయంలో మాత్రం పరీక్ష భయంతోనే విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతటి ఒత్తిడి ఉన్న ఈ పరిక్షల్లో కీలక సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ జాతీయ స్థాయి పరీక్ష కేవలం ప్రవేశ పరీక్ష మార్కులు ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. అందుకే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులపై ఆరో తరగతి నుంచే ఒత్తిడి పెడుతున్నారు. అందుకే సంస్కరణలు చేపట్టాలని కేంద్రం చూస్తోంది. ప్రవేశ పరీక్ష మార్కులతోపాటు బోర్డు పరీక్షల్లో వచ్చే మార్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చూస్తోంది. ఇలా చేయడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి చదువుల శైలిలో మార్పులు వస్తాయని ఆశిస్తోంది  

పరిగణలోకి బోర్డు పరీక్ష ఫలితాలు 

ప్రస్తుతం జేఈఈ, నీట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులు ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు. అందులో ఈ మార్కులు, రిజర్వేషన్లు ఆధారంగా వారికి అత్యున్నత విద్యా సంస్థల్లో చదువుకునే వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు బోర్డు పరీక్షలను కేవలం అర్హతగా చూస్తున్నారు. అంటే బోర్డు పరీక్షల్లో పాస్ అయితే చాలు వాళ్లు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు రాసుకోవచ్చు. దీన్ని మార్చాలని కేంద్రం చూస్తోందని తెలుస్తోంది. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల మెరిట్ జాబితా సిద్ధం చేసినప్పుడు బోర్డు పరీక్షల మార్కులను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిదని భావిస్తోంది. ఇది 50 శాతం వరకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తోంది.  

ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టు ఈ సంస్కరణ అమలులోకి వస్తే విద్యార్థులు, కాలేజీలు బోర్డు చదువులపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాటిని పాస్ కోసం మాత్రం చూస్తూ వచ్చారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై ఎక్కువ ఫోకస్ చేశారు. అంతే కాదు పోటీ పరీక్ష తీవ్రతను కూడా తగ్గించే పనిలో ఉంది. ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న సబ్జెక్ట్‌కు అనుగుణంగానే సిలబస్ మారిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా కోచింగ్ సెంటర్స్‌ దందా కూడా తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడాదిలో ఒకసారి మాత్రమే ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వారు, ఇప్పుడు దీన్ని మల్టిపుల్ టైమ్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్ కూడా ప్రభుత్వం వద్ద ఉంది. కంప్యూట్ ఆధారిత ఆన‌ డిమాండ్ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సులు అందుకున్నారు.

మార్పులకు కారణాలు 

కీలకమైన సంస్కరణకు చాలా కారణాలు ఉన్నాయి. పరీక్ష పత్రాల లీకేజీ ప్రధాన సమస్యగా మారింది. పరీక్షలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా లీకేజీలు అరికట్టడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. దీంతోపాటు పరీక్ష విధానంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. మూల్యాంకనంపై అనేక అనుమానాలు ఉంటున్నాయి. పైస్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది కేవలం ఈ జాతీయ స్థాయి పరీక్షల కోసమే సన్నద్ధమవుతున్నారు. కీలకమైన బోర్డు సిలబస్‌ను పట్టించుకోవడం లేదు. ప్రత్యేక కోచింగ్ సెంటర్స్‌కు వెళ్లి కాలేజీకులకు, స్కూల్స్‌కు వెళ్లకుండా ప్రిపేర్ అవుతున్నారు. దీని వల్ల వారిలో సబ్జెక్ట్ రాకుండా పోతోంది. అలాంటి విద్యార్థులు సీటు రాకపోతే ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు విద్యార్థులు సీరియస్‌గా అన్నింటిని కవర్ చేస్తూ చదువుతున్నారు. అలాంటి విద్యార్థుల జీవితం ఒక రోజు పరీక్షతో నిర్ణయం కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ రోజు విద్యార్థి రాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకా ఏదైనా జరిగినా మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. విలువైన కాలం వృథా పోతోంది. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టాలని చూస్తోంది. 

సంస్కరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే....

ఈ రెండు జాతీయ స్థాయి పరీక్షా విధానంలో ఉన్న లోపాలు గమనించిన ప్రభుత్వం గత ఏడాది 9 మంది సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. లోపాలు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పడకుండా, పారదర్శకత పెంచేందుకు లోతైన అధ్యయనం చేయాలని టాస్క్ ఈ కమిటీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కమిటీ తన స్టడీని కంప్లీట్ చేసింది. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వబోతోంది. ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత వారు చేసిన సిఫార్సులు అమలు విషయంపై క్లారిటీ వస్తుంది. వాటి తీవ్రతను బట్టి వచ్చే విద్యాసంవత్సరం నుంచా లేదా దశల వారీగా అమలు చేస్తారా అనేది తేల్చనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రం కొన్ని అమలు అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. 

Frequently Asked Questions

జేఈఈ, నీట్ పరీక్షా విధానంలో సంస్కరణలు ఎందుకు చేపడుతున్నారు?

విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి, పరీక్ష పత్రాల లీకేజీలు, మూల్యాంకనంపై అనుమానాలు, బోర్డు సిలబస్‌ను నిర్లక్ష్యం చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ సంస్కరణలు చేపడుతున్నారు.

జేఈఈ, నీట్ ప్రవేశాల్లో బోర్డు పరీక్షల మార్కుల గురించి ప్రధానంగా ప్రతిపాదించిన సంస్కరణ ఏమిటి?

జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష మార్కులతో పాటు బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది 50 శాతం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.

బోర్డు పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి, చదువుల శైలిలో మార్పులు వస్తాయి. విద్యార్థులు బోర్డు చదువులపై కూడా శ్రద్ధ పెడతారు, కోచింగ్ సెంటర్ల దందా కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

ఈ సంస్కరణలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి?

9 మంది సభ్యుల నిపుణుల కమిటీ అధ్యయనం పూర్తి చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. నివేదిక అందిన తర్వాత వచ్చే విద్యాసంవత్సరం నుంచా లేదా దశల వారీగా అమలు చేస్తారా అనేది తేలుస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget