అన్వేషించండి

NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!

NEET UG 2026 Result: నీట్ రీ-ఎగ్జామ్ 2026 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. జూలై 20వ తేదీ నాటికి ఫలితాలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. వాటిని అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NTA: నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలు జూలై 20లోగా విడుదల.
  • వేగంగా జరుగుతున్న జవాబు పత్రాలు, అభ్యంతరాల మూల్యాంకన ప్రక్రియ.
  • ఫలితాల అనంతరం ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
  • ఆల్ ఇండియా, స్టేట్ కోటా సీట్లు ర్యాంకులను బట్టి కేటాయిస్తారు.

NEET UG 2026 Result: నీట్ రీ-ఎగ్జామ్ 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది వైద్య విద్యార్థులకు కొంత ఊరట లభించింది. నీట్ రీ-ఎగ్జామ్ 2026 ఫలితాలను జూలై 20వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచించింది. ఏజెన్సీ ఇంకా నిర్దిష్ట తేదీని ప్రకటించనప్పటికీ, ఫలితాల తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా వాటిని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని కూడా స్పష్టం చేశారు. 

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష వాస్తవానికి మే 3వ తేదీన జరగాల్సి ఉండగా, పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దు అయ్యింది. ఆ తర్వాత ఈ పరీక్షను జూన్ 21వ తేదీకి తిరిగి షెడ్యూల్ చేశారు. ఇప్పుడు అభ్యర్థులందరూ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వేగంగా జవాబు పత్రాల మూల్యాంకనం 

NTA అధికారుల ప్రకారం, ఫలితాలను సకాలంలో విడుదల చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ జవాబు పత్రాలను తనిఖీ చేయడమే కాకుండా, తాత్కాలిక జవాబు కీలకు విద్యార్థులు సమర్పించిన దాదాపు 10,000 అభ్యంతరాలను కూడా ఒక్కొక్కటిగా సమీక్షిస్తోంది.

ప్రతి అభ్యంతరంతోపాటు సమర్పించిన పత్రాలు, సాక్ష్యాలతో పోలుస్తున్నారు. అవి సరైనవని తేలితే, జవాబును సవరించి, ఆ తర్వాతే తుది జవాబు కీని విడుదల చేయడం జరుగుతుంది. దీని ఆధారంగానే ఫలితాలు నిర్ణయిస్తారు. 

ఫలితాలు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ .

ఫలితాలు విడుదలైన వెంటనే MBBS, BDS, ఇతర వైద్య కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిర్వహిస్తుంది, కాగా స్టేట్ కోటా కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.

కౌన్సెలింగ్ సమయంలో, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, తమకు నచ్చిన వైద్య కళాశాల,  కోర్సును ఎంచుకోవాలి. అభ్యర్థి నీట్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్ నియమాలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత విద్యార్థులు నిర్దేశించిన సమయంలోగా తమ తమ కళాశాలలకు హాజరు కావాలి.

ఫలితాన్ని ఎలా చెక్‌ చేస్తారు?

ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు అధికారిక నీట్ వెబ్‌సైట్ నుంచి తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ స్కోర్‌కార్డులతోపాటు వారి ఆల్ ఇండియా ర్యాంక్, కటాఫ్, కౌన్సిలింగ్‌కు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది.

Frequently Asked Questions

నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?

జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచనల ప్రకారం జూలై 20వ తేదీలోగా ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాల తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి.

నీట్ పరీక్ష ఎందుకు రీ-షెడ్యూల్ చేయబడింది?

మొదట మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దు చేయబడింది. ఆ తర్వాత ఈ పరీక్షను జూన్ 21వ తేదీకి తిరిగి షెడ్యూల్ చేశారు.

నీట్ ఫలితాలు విడుదలైన తర్వాత ఏమి జరుగుతుంది?

ఫలితాలు విడుదలైన వెంటనే MBBS, BDS, ఇతర వైద్య కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ ర్యాంక్ ఆధారంగా సీట్లను పొందుతారు.

నీట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు అధికారిక నీట్ వెబ్‌సైట్ నుంచి తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డులలో ఆల్ ఇండియా ర్యాంక్, కటాఫ్ వివరాలు ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget