అన్వేషించండి

AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

AP Intermediate Exams 2027 | ఏపీ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి.

AP Inter Exams Schedule | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి పి.రంజిత్‌ బాషా ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం ప్రథమ సంవత్సరం (Inter 1st Year) పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు నిర్వహిస్తారు. సెకండియర్ (Inter 2nd Year) పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు కొనసాగుతాయి.

ఎగ్జామ్ పేపర్లకు సంబంధించి ఇంటర్ బోర్డు పలు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. రెండో భాషా సబ్జెక్టు (పార్ట్‌-2) స్థానంలో అదనంగా ఎంపిక చేసుకునే గణితం, జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్, కామర్స్ వంటి సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. బైపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా గణితాన్ని, ఎంపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా జీవశాస్త్రాన్ని ఎంచుకున్న సందర్భాలలో కోర్, అదనపు సబ్జెక్టుల వారికి కలిపి ఒకే రకమైన ఎగ్జామ్ పేపర్ ఇస్తారు. గతంలో ఫెయిలైన అభ్యర్థులకు పాత సిలబస్‌ ఆధారంగానే ప్రశ్నపత్రాలు ఉంటాయని స్పష్టం చేశారు.

నైతికత, మానవ విలువల పరీక్షను జనవరి 27న, పర్యావరణ విద్య పరీక్షను జనవరి 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. సమగ్ర శిక్షా వృత్తి విద్య (ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ స్థాయి-4) థియరీ పరీక్షలను ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. థియరీ పరీక్షలకు ముందే ప్రాక్టికల్స్, ఇతర అనుబంధ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయి. వీటిని రోజుకు 2 విడతలుగా (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు) నిర్వహిస్తారు. 

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ షెడ్యూల్

ఫిబ్రవరి 24 - ఎలక్టివ్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం,  హిందీ, ఉర్దూ, తమిళ్, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్‌

ఫిబ్రవరి 26 - ఇంగ్లీష్ 

మార్చి 1 - కోర్, అదనపు సబ్జెక్టులు (మ్యాథ్స్, సివిక్స్‌) 

మార్చి 3 - జీవశాస్త్రం, చరిత్ర 

మార్చి 5 - ఫిజిక్స్, ఎకనామిక్స్

మార్చి 9 - కెమిస్ట్రీ, కామర్స్‌ 

మార్చి 12 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్‌

మార్చి 15 - మోడ్రన్‌ లాంగ్వేజ్, జాగ్రఫీ


ఏపీ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్

ఫిబ్రవరి 25 - ఎలక్టివ్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, చరిత్ర, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్‌, బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ.

ఫిబ్రవరి 27 - ఇంగ్లీష్

మార్చి 2 - కోర్, అదనపు సబ్జెక్టులు (మ్యాథ్స్, సివిక్స్‌)

మార్చి 4 - జీవశాస్త్రం, చరిత్ర

మార్చి 8 - ఫిజిక్స్, ఎకనామిక్స్

మార్చి 11 - కెమిస్ట్రీ, కామర్స్‌

మార్చి 13 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్‌

మార్చి 16 - మోడ్రన్‌ లాంగ్వేజ్, జాగ్రఫీ

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Embed widget