అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా విశాఖపట్నం, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సెలవుల తేదీలు జిల్లాను బట్టి మారుతాయి.
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్నాబ్ తుఫాను (Cyclone Arnab) ప్రభావంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా విశాఖపట్నంలో 27, 28 తేదీల్లో, అనకాపల్లి జిల్లాలో 27 నుంచి 29 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

- తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాలకు విద్యాసంస్థల సెలవులు.
- అనకాపల్లిలో లోతట్టు ప్రాంత ప్రజల తరలింపునకు అధికారుల ఆదేశాలు.
- విద్యుత్, సమాచారం, ఆహార నిల్వలు, సహాయ శిబిరాలు సిద్ధం.
విశాఖపట్నం: అర్నాబ్ తుపాను ప్రభావం తీర ప్రాంత జిల్లాలపై అధికంగా ఉంటుందని అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పార్వతీపురం, పోలవరం జిల్లాల్లోనూ 2 నుంచి మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు సిబ్బందిని హెచ్చరించారు.
అర్నాబ్ తుపాను నేపధ్యంలో 27, 28వ తేదీల్లో (మంగళవారం, బుధవారం) జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ కుమార్ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసినా, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు తెరిచినట్లయితే సీజ్ చేస్తామని డీఈవో ప్రకటన ద్వారా హెచ్చరించారు. అర్నబ్ తుఫాను దృష్ట్యా మంగళవారం, బుధవారం కృష్ణా జిల్లాలోని పాఠశాలలకు కలెక్టర్ డీకే బాలాజీ సెలవులు ప్రకటించారు.
అనకాపల్లి: తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు వేడి తాగునీరు, నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాబోయే మూడు రోజుల్లో అర్నాబ్ తుఫాను ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. అక్టోబర్ 26 నుంచి భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం వివిధ శాఖల జిల్లా అధికారులతో వెబ్‌ఎక్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను తరలించాలి
మండలాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అక్టోబర్ 26వ తేదీ సాయంత్రంలోగా గుర్తించి, అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అనకాపల్లి కలెక్టర్ ఆదేశించారు. తరలించిన ప్రజలకు తాగునీరు, భోజనం, అవసరమైన వసతులు కల్పించాలన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు సహా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులు ముందుగానే అందుబాటులో ఉంచాలన్నారు
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సహాయక శిబిరాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వదంతులను నమ్మవద్దని సూచించారు.
విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరం పనిచేయాలి
అర్ణబ్ తుఫాను సమయంలో మొబైల్ ఫోన్ టవర్లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని అనకాపల్లి కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర సేవలకు విద్యుత్, సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అక్టోబర్ 26వ తేదీ నుంచి కలెక్టరేట్‌లో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ పనిచేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో, మండల స్థాయిలో మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
కాకినాడ జిల్లాలోనూ సెలవులు.. అప్రమత్తం
కాకినాడ కలెక్టర్ జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. జిల్లాలోని బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం 0884 2356901, 9849903879 నంబర్లను సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రులు, తాగునీటి పథకాలకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలన్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉంచాలని ఆదేశించడంతో పాటు రెండు, మూడు రోజులకు సరిపడా ఆహారం, తాగునీరు, మందులు సిద్ధం చేసుకోవాలిని సూచించారు.
Frequently Asked Questions
ఏయే జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు?
విశాఖపట్నం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఎప్పటి వరకు?
విశాఖపట్నం జిల్లాలో అక్టోబర్ 27 మరియు 28 తేదీలలో (మంగళవారం, బుధవారం) పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తుఫాను దృష్ట్యా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలి. 2-3 రోజులకు సరిపడా ఆహారం, తాగునీరు, మందులు సిద్ధం చేసుకోవాలి, వదంతులు నమ్మవద్దు.
అత్యవసర సహాయం కోసం కాకినాడ జిల్లాలో ఎవరిని సంప్రదించాలి?
కాకినాడ జిల్లాలో అత్యవసర సహాయం కోసం 0884 2356901 లేదా 9849903879 నంబర్లను సంప్రదించవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























