Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ రోజు ఇవి కొనకండి, అశుభం కలుగుతుంది!
Dont buy these on Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం మంచిది అయితే కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదు. అవేంటో తెలుసుకుందాం.

Akshaya Tritiya 2025 : ఏప్రిల్ 30 బుధవారం అక్షయ తృతీయ. ఈ సందర్భంగా ఏం కొనాలో కాదు ఏం కొనకూడదో మీకు తెలియజేసేందుకే ఈ కథనం.
తృతీయ తిథి ఏప్రిల్ 29 న సాయంత్రం 8:31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30 న సాయంత్రం 6.18 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి (సూర్యోదయం ఆధారిత గణన) ప్రకారం, అక్షయ తృతీయను ఏప్రిల్ 30 న జరుపుకుంటారు. ఈ రోజు పూజా ఆచారాలు, కొనుగోళ్లకు అనువైన రోజుగా పరిగణిస్తారు.ఈ రోజు మొత్తం శుభదినంగానే భావిస్తారు. ప్రత్యేకంగా మంచిసమయం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు అనేక అరుదైన , అనుకూలమైన యోగాలు కలిసి వస్తున్నాయి. ఇవి సంపదను పెంచి శ్రేయస్సును ఇస్తాయని నమ్ముతారు.
అక్షయ తృతీయను చాలా శుభ దినంగా భావిస్తారు. ఈ రోజున షాపింగ్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారని, ధనవృద్ధి ఉంటుందని చాలామంది నమ్ముతారు. అదేసమయంలో అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం అశుభంగా భావిస్తారు. ఆవస్తువులు కొన్నా, ఎవరి వద్దనైనా తీసుకుని అయినా ఇంటికి తీసుకురావడాన్ని అశుభంగా భావిస్తారు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం
ఇనుము వస్తువులు
అక్షయ తృతీయ ఇనుము వస్తువులను కొనుగోలు చేయడం అశుభంగా భావిస్తారు. ఈ రోజు కత్తి, కత్తెర, కొడవలి వంటి పదువునైన వస్తువులను కొనుకోలు చేయకండి. అలా చేస్తే ఇంట్లో కలహాలు, అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంటుంది.
నలుపు రంగు వస్తువులు
అక్షయ తృతీయ రోజున నలుపు రంగు వస్తువులను కొనకూడదు. నలుపు రంగును అశుభంగా భావిస్తారు. పైగా అక్షయ తృతీయ శుభ దినం కాబట్టి ఈ రోజున నలుపు రంగు బట్టలు, ఫర్నిచర్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది.
అల్యూమినియం పాత్రలు
అక్షయ తృతీయ రోజున అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులను కొనకూడదు, వాటిని కొనుగోలు చేయడం అశుభంగా భావిస్తారు. ఈ రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం శుభంగా భావిస్తారు కానీ అవి కూడా లోహాల కిందకే వస్తాయి. అందుకే వీటిని కొనుగోలు చేయడం కూడా అశుభమే
ముళ్ళున్న మొక్కలు
అక్షయ తృతీయ రోజున ఇంటికి ముళ్ళున్న మొక్కలను ఇంటికి తీసుకురండి. సాధారణంగా ముళ్లు ఉన్న మొక్కలు ఇంట్లో ఉంచకూడదు అని చెబుతారు. అక్షయ తృతీయరోజు ఇలాంటి మొక్కలు తీసుకొస్తే అశుభం మాత్రమే కాదు ఇంట్లో వివాదాలు పెరుగుతాయట.
అప్పు ఇవ్వొద్దు తీసుకోవద్దు
అక్షయ తృతీయ రోజు అప్పులు చేయొద్దు..ఎవరికీ మీరు అప్పులు ఇవ్వొద్దు. రానిబాకీలు ఏమైనా ఉంటే వసూలు చేసుకునేందుకు ప్రయత్నించండి.
జూదం వద్దు
లాటరీలు, బెట్టింగ్ లు అంటూ జూదం జోలికి పోవద్దు ఈ రోజు. అక్షయ తృతీయ రోజు మీరు చేసే ప్రతి పనీ రెట్టింపు ఫలితం ఇస్తుంది.. అది పుణ్యం అయినా, పాపం అయినా...
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా మాత్రమే అందించాం. https://telugu.abplive.com/ ఈ విధమైన నమ్మకాన్ని, సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకునేముందు నిపుణులును సంప్రదించండి.






















