అన్వేషించండి

India-US Trade: వరుసగా నాలుగోసారీ అమెరికాదే ఫస్ట్‌ ప్లేస్‌ - రెండో స్థానంలో చైనా, థర్డ్‌ ర్యాంక్‌లో UAE

India-US Trade Value: భారతదేశం-అమెరికా మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. అమెరికా వరుసగా నాలుగోసారి కూడా భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగడమే దీనికి రుజువు.

America Is Indias Top Trading Partner In FY25: గత ఆర్థిక సంవత్సరం 2024-25లో అమెరికా భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. వాస్తవానికి, భారతదేశానికి అతి పెద్ద ట్రేడింగ్‌ పార్ట్‌నర్‌గా US నిలవడం ఇది వరుసగా నాలుగో సంవత్సరం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ (India-US bilateral trade value) 131.84 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని భారత ప్రభుత్వ డేటా చూపించింది. భారత్‌కు రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల లిస్ట్‌లో, మన పొరుగు దేశం చైనా రెండో స్థానంలో ‍‌(China is India's second largest trading partner) ఉంది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25), చైనాతో భారతదేశ వాణిజ్య లోటు 99.2 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.   

అమెరికాతో వాణిజ్య మిగులు
2024-25 ఆర్థిక సంవత్సరంలో, అమెరికాకు భారతదేశం ఎగుమతులు 11.6 శాతం పెరిగి 86.51 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి, 2023-24లో ఈ విలువ 77.52 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అదే సమయంలో, అమెరికా నుంచి మన దిగుమతులు 2024-25లో 7.44 శాతం పెరిగి 45.33 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి, ఇది 2023-24లో 42.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఆ ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు (India's trade surplus with US) 41.18 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది, ఇది 2023-24లో 35.32 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

చైనాతో వాణిజ్య లోటు
చైనాకు భారతదేశం ఎగుమతులు 2023-24లో 16.66 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఒక్క ఏడాది వ్యవధిలోనే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14.5 శాతం తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 2023-24లో 101.73 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25లో 11.52 శాతం పెరిగి 113.45 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఈ ఎగుమతి-దిగుమతుల విలువ ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో, చైనాతో భారతదేశ వాణిజ్య లోటు ‍‌(India's trade deficit with China) దాదాపు 17 శాతం పెరిగి 99.2 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది, ఇది 2023-24లో 85.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2024-25లో 127.7 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో  (India-China bilateral trade value) చైనా భారతదేశం రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, 2023-24లో ఇది 118.4 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.        

మూడో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2013-14 నుంచి 2017-18 వరకు & 2020-21లో కూడా చైనా భారతదేశానికి అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనాకు ముందు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates - UAE) ‍‌భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2021-22 నుంచి అమెరికాతో వాణిజ్యం పెరిగింది. దీంతో.. చైనా, UAEని వెనక్కు నెట్టిన అమెరికా, భారతదేశానికి అతి పెద్ద ట్రేడ్‌ పార్ట్‌నర్‌గా ఉద్భవించింది. గత ఆర్థిక సంవత్సరంలో, UAE 100.5 బిలియన్‌ డాలర్లతో భారతదేశానికి మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా  ‍‌(UAE is India's second largest trading partner) అవతరించింది.         

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget