అన్వేషించండి
RRB NTPC Exams: రైల్వే నాన్ టెక్నికల్ పరీక్ష తేదీలు విడుదల..

RRB
1/6

RRB NTPC Exams 2021: రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) 7వ విడత పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఖరారు చేసింది. ఈ పరీక్షలను జూలై 23, 24, 26, 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.
2/6

రైల్వేలో దాదాపు 16 నెలల క్రితం నాన్ టెక్నికల్ కేటగిరీలో 35,281 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆరు దశల్లో పరీక్షలను నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చివరి దశ పరీక్షలను వాయిదా వేసింది.
3/6

దాదాపు 2.78 లక్షల మంది అభ్యర్థులు చివరి దశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 76 నగరాల్లోని 260 కేంద్రాల్లో ఎన్‌టీపీసీ చివరి విడత పరీక్షలను నిర్వహించనున్నట్లు RRB తెలిపింది.
4/6

పరీక్ష నిర్వహణ తేదీకి నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
5/6

కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పింది.
6/6

పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని సూచించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (http://www.rrbcdg.gov.in/) వెబ్‌సైట్‌లో చూడవచ్చని వివరించింది.
Published at : 07 Jul 2021 10:57 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రికెట్
క్రికెట్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion