అన్వేషించండి
Walking on Grass : గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? రోజూ కాసేపు నడిచేయండి
Walking on Grass Benefits : రోజులో కాసేపైనా గడ్డిమీద నడిస్తే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయంటున్నారు. ఇంతకీ గడ్డిపై నడిస్తే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గడ్డి మీద నడిస్తే కలిగే లాభాలివే (Image Source : Envato)
1/8

రోజూ వాక్ చేసే అలవాటు ఉంటే.. మీరు దానిలో కాసేపు గడ్డిపై నడవడానికి ఆసక్తిని చూపండి. ఎందుకంటే పాదాలకు చెప్పులు లేకుండా గడ్డిమీద నడిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.
2/8

గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే అది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించి.. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
3/8

మీకు కీళ్ల సమస్యలుంటే.. గడ్డి మీద రోజూ నడిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది మోకాళ్లు, చీలమండలలో నొప్పిని తగ్గిస్తుంది.
4/8

మానసిక ఒత్తిడిని తగ్గించి.. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ ఉంటుంది. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా అందుతుంది.
5/8

చెప్పులు లేకుండా గడ్డిపై నడిస్తే ఆక్యుప్రెషర్ ప్రభావం ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచి.. యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. కంటి చూపునకు కూడా ఇది మంచిదట.
6/8

గడ్డి మీద నడిస్తే ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది. పాదాలకు సహజమైన మసాజ్ అందుతుంది. హ్యాపీగా ఉంటారు.
7/8

రోజూ గడ్డి మీద 30 నిమిషాలు నడిస్తే.. దాదాపు 120 నుంచి 150 కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గుతూ, మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూసేవారు దీనిని ఫాలో అవ్వొచ్చు.
8/8

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.
Published at : 17 Mar 2025 04:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion