Patanjali Ayurveda: దేశీయంగా అతర్జాతీయంగా పతంజలి ఎలా విస్తరిస్తోంది..?
Patanjali: డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పతంజలి – Patanjali జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తోంది

Patanjali Ayurveda: యోగ గురు బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద్, ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యాన్ని, వెల్‌నెస్ ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. అనేక ఉత్పత్తుల ద్వారా పతంజలి సంస్థ ప్రజలకు చేరువవుతోంది. ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ, ఆయుర్వేద ఔషధాలు, హర్బల్ హోమ్ కేర్, ఆయుర్వేద వైద్య ప్రచురణలు వంటి విభిన్న ఉత్పత్తులను పతంజలి సంస్థ అందిస్తోంది.
ప్రకృతి, సేంద్రీయ పదార్థాలను విరివిగా ఉపయోగిచడం ద్వారా "రసాయనాల ఆధారిత ఉత్పత్తులకు" ఓ ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నట్లు పతంజలి చెబుతోంది.
తమ ఉత్పత్తుల నాణ్యత, ప్రయోజనాల కారణంగా భారతీయ వినియోగదారులలో ధృడమైన నమ్మకాన్ని సంపాదించుకున్నామని పతంజలి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. “విస్తృతంగా లభించడంతో పాటు, అందుబాటులో ఉండే ధరలు” కారుణంగా ప్రతి భారతీయ కుటుంబంలో పతంజలి ఓ ముఖ్యమైన భాగంగా మారిదని చెప్పారు.
మార్కెట్ వ్యూహం- విస్తరణ
డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, ఈ-కామర్స్ వేదికల ద్వారా పతంజలి తన ఉత్పత్తులను విస్తరించుకుంది. అదే విధంగా, బలమైన పంపిణీ నెట్‌వర్క్, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో తన కస్టమర్ బేస్‌ను విస్తరించుకుంది. ఆయుర్వేదంపై దృష్టి పెట్టడం వల్ల ప్రకృతి ఆధారిత, సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులను ఆకర్షించింది.
ఒక్క ఇండియాలోనే కాదు.. పతంజలి అంతర్జాతీయంగా విస్తరించి, "ప్రకృతి సమ్మతమైన,సురక్షితమైన" ఆయుర్వేద ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. సంప్రదాయ భారతీయ వైద్యం పై అవగాహన పెంచి, ఆధునిక జీవనశైలికి తగిన ప్రకృతి ఆధారిత ఆరోగ్య సంరక్షణను ప్రచారం చేస్తోంది.
మహారాష్ట్రలో ఫుడ్ అండ్ హర్బల్ పార్క్
పతంజలి ఇటీవల మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విశాలమైన ఫుడ్ అండ్ హర్బల్ పార్క్‌ను ప్రారంభించింది. ఇది రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. మొదటిగా రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టగా, అదనంగా రూ. 1,500 కోట్ల పెట్టుబడిని ప్రణాళికలో ఉంది.
ఈ సదుపాయాన్ని మార్చి 10న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ప్రారంభించారు. గడ్కరీ మాట్లాడుతూ, ఇది విదర్భ ప్రాంత రైతులకు మేలు చేయనుందని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

