అన్వేషించండి

పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే

EMI Management Tips: చాలా సందర్భాలలో ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి రుణాలు (Loans) తీసుకుంటారు. మొదట వారు EMIలను సులభంగానే చెల్లిస్తారు. కానీ ఖర్చులు పెరగడంతో మీ నెలవారీ వాయిదాలు భారం కావొచ్చు.

EMI Burden Management Tips: తక్షణ అవసరం తీరేందుకు మీ వద్ద నగదు లేని సందర్భంలో లోన్ తీసుకుంటారు. అయితే కొంతకాలం తరువాత EMI చెల్లించడానికి ఇబ్బంది పడి వాయిదాలు చెల్లించడం మానేస్తారు. దాంతో అది క్రెడిట్ స్కోరు మీద ప్రభావం చూపుతుంది. బ్యాంకులు, సంస్థల నుంచి మీపై బకాయి చెల్లింపుల కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఇంటి నెలవారీ బడ్జెట్, క్రెడిట్ కార్డ్ బకాయిలు,  రకరకాల లోన్ల EMIలు కలిసి మీపై ఒత్తిడిని పెంచుతాయి. ఒకవేళ మీరు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే, కొన్ని చిట్కాలను పాటించి సమస్య నుండి బయటపడవచ్చు.

ఖర్చులను తగ్గించుకోండి, కొత్త అప్పులు చేయకండి
పెరుగుతున్న ఖర్చులను భరించలేక, తమ అవసరాల కోసం ప్రజలు తరచుగా కొత్త రుణాలు తీసుకుంటూ ఉంటారు. లోన్లు పెరిగేకొద్దీ మీ EMI భారం పెరుగుతోంది. దాంతో అవి చెల్లించలేక నెమ్మదిగా అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మీపై కూడా EMI ఒత్తిడి పెరుగుతుంటే, ఫస్ట్ కొత్త లోన్ తీసుకోవడం ఆపివేయాలి. పాత EMIల కోసం డబ్బును సర్దుబాటు చేయడానికి మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉదాహరణకు, బయట తినడం, అనవసరమైన షాపింగ్‌లను తగ్గించండి లేదా పూర్తిగా ఆపేయండి. ఎంత పొదుపు చేసినా, ఆ మొత్తాన్ని EMI తీర్చడానికి ఉపయోగించాలి. అన్నింటికంటే ఎక్కువ వడ్డీ ఉన్న లోన్‌ను ముందుగా పూర్తి చేసుకోవాలి. 

చిన్న లోన్స్ క్లోజ్ చేయండి 
మీరు వేర్వేరు చిన్న లోన్స్ సంబంధించి అనేక EMIలు చెల్లిస్తున్నట్లయితే, మొదట ఆ చిన్న చిన్న రుణాలను తీర్చివేయడానికి ప్రయత్నించండి. వడ్డీ రేటును తగ్గించడం గురించి లేదా 'వన్-టైమ్ సెటిల్మెంట్' (One-time settlement) గురించి బ్యాంకుతో మాట్లాడటం కూడా ఒక మంచి ప్రత్యామ్నాయం కావచ్చు. కొంతకాలం తరువాత లోన్స్ తగ్గడంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. 

పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వండి
మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖచ్చితంగా పొదుపు చేయాలి. పొదుపు చేసిన ఆ మొత్తాన్ని లోన్ అసలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి (Bulk payment) ఉపయోగించవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. అప్పులు, లోన్స్ తగ్గి కొంచెం ఊరట పొందుతారు. క్రెడిట్ కార్డ్ బాకీలు ముందుగా చెల్లించాక మిగతా లోన్స్ చెల్లించేలా ప్లాన్ చేసుకోవడం బెటర్.


ఆర్థిక ప్రణాళిక కోసం చిట్కాలు (Financial Planning Tips)
50/30/20 రూల్: మీ నెలవారీ ఆదాయంలో 50 శాతం అవసరాలకు, 30 మీ లగ్జరీ, కోరికలకు, 20% కచ్చితంగా పొదుపు లేదా అప్పులు తీర్చడానికి కేటాయించాలి.

ఎమర్జెన్సీ ఫండ్: ఏదైనా అనుకోని ఖర్చు వస్తే మళ్ళీ అప్పు చేయకుండా ఉండటానికి మీ వద్ద కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బులు ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget