అన్వేషించండి

Home Loan Tips:హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!

Home Loan Tips:హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ అనేది కేవలం వడ్డీరేట్ల మార్పు మాత్రమే కాదు. అది పక్కా ఆర్థిక ప్రణాళిక. అయితే ఎలాంటి సమయంలో నిర్ణయం తీసుకోవాలో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోమ్ లోన్ బదిలీ ప్రక్రియలో ప్రాసెసింగ్, లీగల్ ఛార్జీలు ఉంటాయి.
  • వేరే బ్యాంకుకు మార్చేటప్పుడు కొత్త లోన్ అప్లికేషన్ ఖర్చులు ఉంటాయి.
  • అదే బ్యాంకులో అంతర్గత బదిలీ వేగంగా, తక్కువ ఖర్చుతో జరుగుతుంది.
  • క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఫోర్ క్లోజర్ ఛార్జీలు ఖర్చును ప్రభావితం చేస్తాయి.

Home Loan Tips: ఆర్థిక అవసరాలు, లేదా తక్కువ వడ్డీ రేట్ల ఆశతో చాలా మంది తమ హోమ్‌లోన్‌ను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంక్‌కు మారుస్తుంటారు. అయితే ఇలా ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ చేసేటప్పుడు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా నష్టం జరుగుతుంది. పైకి కనిపించేత ఈజీ కాదీ ప్రక్రియ. ఇందులో ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీలు, బ్యాంకుల అంతర్గత నిబంధనలు వంటి అనేక ఆర్థిక కోణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మీరు లోన్ అదే బ్యాంకులో అంతర్గతంగా మారుస్తున్నారా లేదా వేరే బ్యాంకుకు తరలిస్తున్నారా ఆనే దానిపై ఖర్చు ఆధారపడి ఉంటుంది. 

వేరే బ్యాంకుకు లోన్ బదిలీ చేయడం 

మీరు ప్రస్తుతం బ్యాంకులో వడ్డీ ఎక్కువగా ఉందని భావించి వేరే బ్యాంకుకు మారినప్పుడు ఆ కొత్త బ్యాంకు దీనిని ఒక ప్రెష్‌లోన్‌ అప్లికేషన్‌గానే పరిగణిస్తున్నారు. దీని వల్ల కొన్ని ఖర్చులు తప్పనిసరి అవుతాయి. కొత్త క్లయింట్‌ను చేర్చుకోవడానికి బ్యాంక్‌ చేసే అడ్మనిస్ట్రేటివ్ పనుల కోసం మీరు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. కొత్త బ్యాంకు తన సొత డ్యూడిలిజెన్స్‌నిర్వహిస్తుంది. అంటే ఆస్తి పత్రాల చట్టపరమైన పరిశీలిన, ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేయడానికి సాంకేతిక మూల్యాంకనం చేస్తారు. ఈ ఖర్చులన్నీ కొనుగోలుదారుడే భరించాలి. ఆస్తిపై ఎటువంటి వివాదాలు లేవని నిర్దారించుకోవడానికి కొత్త ఎన్‌కంబ్రాన్స్‌ సర్టిపికెట్ అంటే ఈసీ, ఇతర చట్టపరమైన వెరిఫికేషన్లు కోసం అదనపు ఖర్చులు అవుతాయి. 

అదే బ్యాంకులో అంతర్గత బదిలీ చేస్తే...

ఒక వేళ మీరు విక్రేత ఇప్పటికే లోన్ తీసుకున్న అదే బ్యాంకును ఎంచుకుంటే ఆ ప్రక్రియ చాలా వేగంగా పూర్తి అవుతుంది. తక్కువ ఖర్చు అవుతుంది. సదరు ఆస్తికి సంబంధించిన అసలు పత్రాలు ఇప్పటికే బ్యాంకు వద్ద ఉంటాయి. కాబట్టి బ్యాంక్‌ ఆస్తిని మళ్లీ మొదటి నుంచి వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ ఆర్థిక అర్హత మాత్రమే చెక్ చేస్తారు. ఆస్తి మూల్యాంకనం ఇప్పటికే రికార్డుల్లో ఉన్నందున బ్యాంక్ తన విచక్షణ మేరకు కొన్ని లీగల్, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించే అవకాశం ఉంది. వేర్వేరు బ్యాంకుల మధ్య భౌతికంగా పత్రాల మార్పిడి జరగాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది సమాయాన్ని బాగా ఆదా చేస్తుంది. 

ఫీజులను ప్రభావితం చేసే ఇతర అంశాలు 

ఏ బ్యాంకును ఎంచుకున్నా, తుది ఖర్చును కొన్ని ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. మీ క్రెడిట్ స్కోరు, ఆదాయ ప్రొఫైల్‌ బాగుంటే, ప్రాసెసింగ్‌ ఫీజులు సర్దుబాటు చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. కొత్త లోన్ వడ్డీ రేటు అనేది ప్రస్తుత ఎంసీఎల్‌ఆర్‌, ఆర్థిక స్థితిగతులపై ఆధారంగా నిర్ణయించబడే స్ప్రెడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ ఆస్తి వ్యాపార అవసరాల కోసం లేదా నివాసేతర అవసరాల కోసం బదిలీ చేస్తుంటే విక్రేత సుమారు మూడు శాతం వరకు ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఇది పరోక్షంగా డీల్ మొత్తం ఖర్చుపై ప్రభావం చూపుతుంది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం వేరే బ్యాంక్ తక్కువ వడ్డీరేటు ఆఫర్ చేసినప్పుడు వెంటనే మారిపోకూడదు. వడ్డీ వల్ల కలిగే పొదుపు మొత్తం మీరు ముందుగా చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోవాలి. 

Frequently Asked Questions

హోమ్ లోన్‌ను వేరే బ్యాంకుకు బదిలీ చేసే ప్రక్రియలో ఎలాంటి ఖర్చులుంటాయి?

వేరే బ్యాంకుకు లోన్ బదిలీ చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు, ఆస్తి పత్రాల చట్టపరమైన పరిశీలన (లీగల్ ఛార్జీలు), మరియు ఆస్తి విలువ అంచనా (టెక్నికల్ వాల్యుయేషన్) వంటి ఖర్చులు ఉంటాయి. కొత్త బ్యాంకు దీనిని ఫ్రెష్ లోన్ అప్లికేషన్‌గా పరిగణిస్తుంది.

అదే బ్యాంకులో హోమ్ లోన్‌ను అంతర్గతంగా బదిలీ చేసుకుంటే ప్రయోజనాలు ఏమిటి?

అదే బ్యాంకులో అంతర్గతంగా బదిలీ చేసుకుంటే ప్రక్రియ వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. ఆస్తి పత్రాలు బ్యాంకు వద్ద ఇప్పటికే ఉంటాయి కాబట్టి మళ్ళీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు, దీనివల్ల లీగల్, అడ్మిన్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది.

హోమ్ లోన్‌ బదిలీ ఖర్చులను ప్రభావితం చేసే ఇతర అంశాలు ఏమిటి?

మీ క్రెడిట్ స్కోరు, ఆదాయ ప్రొఫైల్‌ బాగుంటే బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులను సర్దుబాటు చేయవచ్చు. వ్యాపార లేదా నివాసేతర అవసరాల కోసం లోన్ బదిలీ చేస్తే ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలు కూడా వర్తించవచ్చు.

హోమ్ లోన్‌ను వేరే బ్యాంకుకు మార్చేటప్పుడు, వడ్డీ ఆదా ప్రాసెసింగ్ ఫీజుల కంటే ఎక్కువ ఉందా అని ఎలా తెలుసుకోవాలి?

తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసినప్పుడు వెంటనే మారిపోకూడదు. వడ్డీ ఆదా మొత్తం, మీరు చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోవడం లాభదాయకం.

టాప్ హెడ్ లైన్స్

Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Embed widget