Telangana Latest News: ప్రధానమంత్రికి, రైల్వేశాఖ మంత్రికి లేఖలు రాసిన రేవంత్ రెడ్డి, కారణం ఏంటంటే?
Telangana Latest News: బీసీ రిజర్వేషన్ బిల్లు ఆవశ్యకతను వివరించేందుకు సమయం ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సీఎం రవంత్ రెడ్డి లేఖ రాశారు.

Telangana Latest News: తెలంగాణ శాస సభ బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లును ఆమోదించింది. ఈ ఇష్యూను ఇప్పుడు దీన్ని కేంద్రం కోర్టులో వేసిన రేవంత్ సర్కారు దానిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకే ఈ అంశంపై ప్రధానమంత్రి మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
బీసీలకు విద్య, ఉద్యో, రాజకీయ అంశాల్లో 42శాతం రిజర్వేషన్ ఇచ్చే బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. దీన్ని కేంద్రం ఆమోదిస్తే తప్ప రిజర్వేషన్ అమలు చేయడం సరికాదు. అందుకే ఈ ఇష్యూలో కేంద్రం వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లాలని నిర్ణయించారు.
తెలంగాణ నుంచి వచ్చే అఖిలక్షం కలిసేందుకు సమయం ఇవ్వాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు అపాయింట్ ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ ప్రకారం ఉన్న రిజర్వేషన్‌లో 50% మించి ఉండకూడదు. ఇప్పుడు తెలంగాణ ఆమోదించిన బిల్లు చట్టం కావాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది. అందుకే దీనిపై చర్చించేందుకు ప్రధాని కలిసి ఒప్పించేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కూడా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఇటీవల తెలంగాణలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలని అందులో పేర్కొన్నారు. కొత్త టెర్మినల్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం అమరజీవి పొట్టిశ్రీరాములు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఎప్పటి నుంచో తెలుగు యూనివర్శిటీకి ఉన్న పొట్టి శ్రీరాముల పేరును తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. ఆ పేరు స్థానంలో సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కొత్తగా నిర్మించిన టెర్మినల్‌కు ఆ పేరు పెట్టాలని కేంద్రానికి సూచిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

