అన్వేషించండి
Thyroid Diet : థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు రోజూ తినాల్సిన ఫుడ్స్ ఇవే.. డైట్లో చేర్చుకోండి
Essential Foods for a Thyroid Diet : థైరాయిడ్ లక్షణాలను కంట్రోల్ చేయడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఈ సమస్యతో ఇబ్బందిపడేవారు కొన్ని ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకోవాలట. అవేంటంటే..

థైరాయిడ్ ఉన్నవాళ్లు తినాల్సిన ఫుడ్స్ ఇవే (Image Source : Envato)
1/7

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొన్ని ఫుడ్స్ తమ డైట్లో చేర్చుకోవడం వల్ల దానిని కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు. ఇంతకీ రోజూ తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
2/7

అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి. సీవీడ్ని మీరు డైట్లో చేర్చుకోవచ్చు. థైరాయిడ్ పనిచేకుండా దారితీసే లోపాలను కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. అయితే దీనిని లిమిటెడ్గానే తీసుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ పనితీరును అధిక అయోడిన్ దెబ్బతీస్తుంది.
3/7

సెలీనియం కోసం బ్రెజిల్ నట్స్ తీసుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియలో సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. బ్రెజిల్ నట్స్ వాపును తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. రోజుకు రెండు, మూడు బ్రెజిల్ నట్స్ తీసుకోవచ్చు.
4/7

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలను డైట్లో తీసుకోవచ్చు. ఇవి వాపును తగ్గించి.. థైరాయిడ్ పనితీరుకు మద్ధతునిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. థైరాయిడ్ని దూరం చేస్తాయి.
5/7

విటమిన్ డి ఎక్కువగా ఉండే ఉత్పత్తులు కచ్చితంగా డైట్లో తీసుకోవాలి. మిల్క్ ప్రొడెక్ట్స్లో విటమిన్ డి, కాల్షియం, అయోడిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవననీ థైరాయిడ్ను కంట్రోల్ చేయండలో హెల్ప్ చేస్తాయి.
6/7

ఆకుకూరల్లో మెగ్నీషియం, ఐరన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇవి థైరాయిడ్ పనితీరుకు ప్రతికూలంగా ప్రభావితం చేసే వాటిని కంట్రోల్ చేస్తాయి. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది.
7/7

థైరాయిడ్ను మీరు కంట్రోల్ చేయాలనుకుంటే వైద్య సహాయం కచ్చితంగా తీసుకోవాలి. మెడిసన్స్ ఉపయోగిస్తూ వీటిని డైట్లో చేర్చుకోవచ్చు. అలాగే నిపుణుల సలహాలు తీసుకుని డైట్ మార్చుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
Published at : 20 Mar 2025 11:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
అమరావతి
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion