Hardik Pandya Comeback: గతేడాదిగా ఆ ఆల్ రౌండర్ ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూశాడు.. అతనిపై ఓ బయోపిక్ తీయొచ్చు.. మాజీ క్రికెటర్ కైఫ్ వ్యాఖ్య
ముంబై సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనను చాలామంది ఎగతాళి, గేలి చేశారు. అయినా అవన్నీ తట్టుకుని, ఆ తర్వాత భారత జట్టు 2 ఐసీసీ టైటిల్స్ గెలవడంతో కీలకపాత్ర పోషించాడు.

IPL 2025 MI VS CSK Live Updates: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గతేడాది ఐపీఎల్ సీజన్ చాలా చేదుగా జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ముంబై ఇండియన్స్ కు తను కెప్టెన్ గా నియమించబడ్డాడు. అయితే అది కొంతమంది ఫ్యాన్స్ కు రుచించలేదు. ముంబై సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనను చాలామంది ఎగతాళీ, గేలి చేశారు. అయినా అవన్నీ తట్టుకుని, ఆ తర్వాత భారత జట్టు రెండు ఐసీసీ టైటిల్స్ గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. అభిమానుల ప్రవర్తనతో హార్దిక్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడని, అయినా కూడా తను కీలక సమయాల్లో రాణించి బౌన్స్ బ్యాక్ అయ్యాడని పేర్కొన్నాడు. ఒక క్రికెటర్ బయోపిక్ తీయదలుచుకుంటే ఈ ఏడాది కాలాన్ని తీసుకుంటే, అందులో అన్నిరకాలైనా నవరసాలు దొరుకుతాయని విశ్లేషించాడు. నిజానికి తొలుత ముంబై తరపున ఆడిన హార్దిక్.. జట్టులో కీలక సభ్యునిగా ఎదిగాడు. ఆ తర్వాత 2022లో సొంత రాష్ట్రానికి చెందిన జట్టు.. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో అడుగు పెట్టడంతో దాని కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ సీజన్ లో జట్టును విజేతగా నిలిపిన హార్దిక్.. తర్వాతి ఏడాది రన్నరప్ గా నిలిపాడు. అయితే గత సీజన్ లో ముంబై కెప్టెన్ గా హార్దిక్ బాధ్యతలు స్వీకరించాడు. స్టార బ్యాటర్ రోహిత్ శర్మ వారసునిగా, అతడిని తప్పించి హార్దిక్ కు పగ్గాలు అప్పగించడం చాలామంది ఫ్యాన్స్ కు రుచించలేదు. దీంతో అతనిపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.
బౌన్స్ బ్యాక్..
ఐపీఎల్లో ఈ చికాకుతోపాటు వ్యక్తిగతంగా భార్య, పిల్లాడికి దూరమై హార్దిక్ మానసిక వేదనకు గురయ్యాడు. అయితే వాటిని మనసులో ఉంచుకుని, జూన్ లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో సౌతాఫ్రికాపై తన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. హెన్రిచ్ క్లాసెన్ ఔట్ చేసి, భారత్ కు విజయాన్ని అందించాడు. అయితే ఆటగాళ్లపై ఇలా విద్వేషం చిమ్మడి సరికాదని కైఫ్ వ్యాఖ్యానించాడు. టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అతను అమలు పరిచాడని, ఇందులో హార్దిక్ ను నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. గతేడాది తనకు ఎంతో కష్టంగా గడిచిందని, అయనా కూడా జట్టుకు తను విశేష సేవ చేశాడని కొనియాడాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ కీలకదశలో సిక్సర్లు బాది టీమ్ ను ఫైనల్లో చేర్చాడని ప్రశంసించాడు.
కీలక దశలో..
నిజానికి హార్దిక్ చాలా సార్లు జట్టు పాలిట ఆపద్భాందవుని పాత్ర పోషించాడు. అటు బ్యాట్, ఇటు బంతితోనూ సత్తా చాటాడు. ఎన్నోసార్లు ప్రత్యర్థి భాగస్వామ్యాలను విడదీసి, భారత్ పుంజుకునేలా చేశాడు. అలాగే బ్యాటింగ్ లో వేగంగా ఆడి, సహచర బ్యాటర్లపై ఒత్తిడిని తొలగించేలా కృషి చేశాడు. దీంతో అభిమానులకు అతనిపై ఉన్న కోపం పూర్తిగా తొలిగిపోయింది. ఈసారి ముంబై కెప్టెన్ గా తనను అంగీకరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ 2025 సీజన్ ఈనెల 22న ప్రారంభమవుతుండగా, తన తొలి మ్యాచ్ ను చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఆడుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

